ముంబయి వేదికగా జరుగుతున్న మూడో టీ20లో టీమిండియా బ్యాట్స్మెన్ చెలరేగారు. వెస్టిండీస్ బౌలర్లను ఓ ఆట ఆడుకున్నారు. నిర్ణీత 20 ఓవర్లలో 240 పరుగులు చేశారు. రోహిత్ శర్మ 71, రాహుల్ 91, కోహ్లీ 70 పరుగులతో విధ్వంసం సృష్టించారు.
తొలుత టాస్ ఓడి బ్యాటింగ్కు దిగింది భారత్.. ఓపెనర్లు రోహిత్-రాహుల్ తొలి వికెట్కు 135 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అనంతరం వచ్చిన పంత్.. పరుగులేమీ చేయకుండానే వెనుదిరిగాడు. క్రీజులోకి వచ్చిన కోహ్లీ.. ఇన్నింగ్స్ చివరి వరకు ఉండి, భారీ స్కోరు చేయడంలో కీలక పాత్ర పోషించాడు. వెస్టిండీస్ బౌలర్లలో విలియమ్స్, పొలార్డ్, కాట్రెల్ తలో వికెట్ దక్కించుకున్నారు.
ఇవీ చదవండి: