టీమిండియాతో రెండో టీ20లో వెస్టిండీస్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. తిరువనంతపురంలో జరుగుతున్న ఈ మ్యాచ్లో నెగ్గి సిరీస్ కైవసం చేసుకోవాలని భావిస్తోంది భారత్. ఇందులో గెలిచి, సిరీస్ ఆశలు సజీవంగా ఉంచుకోవాలని చూస్తోంది విండీస్.
-
Match-ready💪#INDvWI | #TeamIndia pic.twitter.com/tSibGeUiKE
— BCCI (@BCCI) December 8, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Match-ready💪#INDvWI | #TeamIndia pic.twitter.com/tSibGeUiKE
— BCCI (@BCCI) December 8, 2019Match-ready💪#INDvWI | #TeamIndia pic.twitter.com/tSibGeUiKE
— BCCI (@BCCI) December 8, 2019
అయితే మ్యాచ్కు వర్షసూచన ఉండటం వల్ల 20 ఓవర్ల పాటు మ్యాచ్ జరుగుతుందా? లేదా? అనే సందేహముంది.
2017లో ఇక్కడ జరిగిన ఏకైక టీ20లో న్యూజిలాండ్-భారత్ తలపడ్డాయి. ఎడతెరపి లేని వర్షం కురిసినా, సిబ్బంది మైదానాన్ని అరగంటలో చక్కగా సిద్ధం చేశారు. 8 ఓవర్లు జరిగిన ఈ మ్యాచ్లో టీమిండియా విజయం సాధించింది.
జట్లు
భారత్: రోహిత్ శర్మ, రాహుల్, కోహ్లీ(కెప్టెన్), శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, భువనేశ్వర్ కుమార్, దీపక్ చాహర్, చాహల్
వెస్టిండీస్: సిమన్స్, లూయిస్, బ్రాండన్ కింగ్, పూరన్, హెట్మయిర్, పొలార్డ్(కెప్టెన్), హోల్డర్, కారీ పియర్రే, హేడెన్ వాల్ష్, షెల్డన్ కాట్రెల్, విలియమ్స్