టీమిండియా చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్ అరుదైన రికార్డుకు చేరువలో ఉన్నాడు. వన్డేల్లో మరో వికెట్ తీస్తే వేగంగా 100 వికెట్లు దక్కించుకున్న భారత బౌలర్లలో ఒకడిగా నిలుస్తాడు. గతంలో మరో భారత పేసర్ షమి ఇదే ఫీట్ సాధించేందుకు 55 వన్డేలు అవసరమయ్యాయి. ప్రస్తుతం కుల్దీప్ 54 వన్డేల్లో 99 వికెట్లు పడగొట్టాడు. రేపు కటక్ వేదికగా వెస్టిండీస్‌తో జరగనున్న నిర్ణయాత్మక వన్డేలో కుల్దీప్ ఈ రికార్డును సాధిస్తాడని అందరూ భావిస్తున్నారు.
ఈ ఫీట్ అందుకుంటే వన్డేలో 100 వికెట్ల క్లబ్‌లో చేరిన 22వ భారత బౌలర్‌గా, 8వ స్పిన్నర్‌గా రికార్డులకెక్కుతాడు కుల్దీప్. అఫ్గానిస్థాన్ లెగ్ స్పిన్నర్ రషీద్ ఖాన్.. వన్డేల్లో 100 వికెట్లను వేగంగా తీసిన బౌలర్‌గా చరిత్ర లిఖించాడు. 44 మ్యాచ్‌ల్లోనే ఈ ఫీట్ అందుకున్నాడు.
ఇటీవలే హ్యాట్రిక్..
విశాఖ వేదికగా విండీస్‌తో జరిగిన రెండో వన్డేలో కుల్దీప్ హ్యాట్రిక్ సాధించాడు. 33వ ఓవర్ వరుస బంతుల్లో హోప్, హోల్డర్, జోసెఫ్‌ను ఔట్ చేశాడు. ఫలితంగా అంతర్జాతీయ వన్డేల్లో రెండుసార్లు హ్యాట్రిక్ నమోదు చేసిన తొలి భారత బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు. 2017లో ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన వన్డేలో తొలిసారిగా హ్యాట్రిక్ తీశాడు కుల్దీప్. ఇతడు అండర్-19లోనూ హ్యాట్రిక్ నమోదు చేయడం విశేషం.
- ' class='align-text-top noRightClick twitterSection' data=''>