భారత్, వెస్టిండీస్ మధ్య చివరిదైన రెండో టెస్టు ఆసక్తికరంగా సాగుతోంది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి 90 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 264 పరుగులు చేసింది. సారథి విరాట్ కోహ్లీ (76; 163బంతుల్లో 10×4), ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (55; 127బంతుల్లో 7×4) అర్ధశతకాలతో ఆకట్టుకున్నారు. పుజారా (6) ఈ మ్యాచ్‌లోనూ విఫలమయ్యాడు. ప్రస్తుతానికి క్రీజులో హనుమ విహారి (42 బ్యాటింగ్), రిషభ్ పంత్ (27 బ్యాటింగ్) ఉన్నారు.
-
That will be Stumps on Day 1. 264/5
— BCCI (@BCCI) August 30, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
Vihari 42*
Pant 27*
Partnership 62* #TeamIndia #WIvIND pic.twitter.com/YkxFTh5rPZ
">That will be Stumps on Day 1. 264/5
— BCCI (@BCCI) August 30, 2019
Vihari 42*
Pant 27*
Partnership 62* #TeamIndia #WIvIND pic.twitter.com/YkxFTh5rPZThat will be Stumps on Day 1. 264/5
— BCCI (@BCCI) August 30, 2019
Vihari 42*
Pant 27*
Partnership 62* #TeamIndia #WIvIND pic.twitter.com/YkxFTh5rPZ
దక్కని శుభారంభం..
రెండో టెస్టులోనూ భారత్‌కు సరైన ఆరంభం దక్కలేదు. పిచ్‌పై కాస్త పచ్చిక ఉండటం వల్ల విండీస్ సారథి హోల్డర్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఓపెనర్లు రాహుల్, మయాంక్ అగర్వాల్ తొలి అరగంట పాటు ఆచితూచి ఆడారు. ఏడో ఓవర్‌లో కేఎల్ (13) హోల్డర్ బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన పుజారా (6) ఆరంభం నుంచే ఇబ్బందిపడ్డాడు. కార్న్‌వాల్ బౌలింగ్‌లో బ్రూక్స్ చేతికి చిక్కాడు. ఫలింతంగా 46 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది టీమిండియా.
-
🌴v 🇮🇳#WIvIND All day affair in the field on Day 1 for the #MenInMaroon
— Windies Cricket (@windiescricket) August 30, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
IND 264/5 (90.0 ov)
Holder 3/39
Roach 1/47
Cornwall 1/69
Live Scorecard
⬇️⬇️⬇️⬇️⬇️ https://t.co/VqaQSVQlls pic.twitter.com/fcWINokWDP
">🌴v 🇮🇳#WIvIND All day affair in the field on Day 1 for the #MenInMaroon
— Windies Cricket (@windiescricket) August 30, 2019
IND 264/5 (90.0 ov)
Holder 3/39
Roach 1/47
Cornwall 1/69
Live Scorecard
⬇️⬇️⬇️⬇️⬇️ https://t.co/VqaQSVQlls pic.twitter.com/fcWINokWDP🌴v 🇮🇳#WIvIND All day affair in the field on Day 1 for the #MenInMaroon
— Windies Cricket (@windiescricket) August 30, 2019
IND 264/5 (90.0 ov)
Holder 3/39
Roach 1/47
Cornwall 1/69
Live Scorecard
⬇️⬇️⬇️⬇️⬇️ https://t.co/VqaQSVQlls pic.twitter.com/fcWINokWDP
విరాట్ విలువైన ఇన్నింగ్స్..
17వ ఓవర్‌లోనే క్రీజులోకి వచ్చిన కోహ్లీ.. మయాంక్‌తో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. మయాంక్ మొదట్లో కాస్త ఇబ్బందిపడ్డా మ్యాచ్ సాగుతున్నకొద్దీ మరింత బాధ్యతాయుతంగా ఆడాడు. వీలైనప్పుడు బౌండరీలు రాబట్టాడు. కార్న్‌వాల్ బౌలింగ్‌లో కాస్త ఇబ్బంది పడినా పట్టుదలగా నిలిచాడు కోహ్లీ. లంచ్ సమయానికి స్కోరు 2 వికెట్ల నష్టానికి 72 పరుగులు చేసింది భారత్. విరామం తర్వాత బ్యాట్స్‌మెన్ ఇద్దరూ వేగం పెంచారు. రోచ్ ఓవర్లో రెండు ఫోర్లతో మయాంక్ అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. కానీ కాసేపటికే హోల్డర్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.
వైస్ కెప్టెన్ రహానెతోనూ కోహ్లీ 49 పరుగుల విలువైన భాగస్వామ్యం నెలకొల్పాడు. రహానె కాస్త నిదానంగా ఇన్నింగ్స్ సాగించినా.. కోహ్లీ మాత్రం అదే జోరు కొనసాగించాడు. గాబ్రియెల్ బౌలింగ్‌లో అర్ధశతకం అందుకున్నాడు. మరోవైపు రహానె (24) కూడా బ్యాట్ ఝళిపించే ప్రయత్నంలో రోచ్ బౌలింగ్‌లో వికెట్‌కీపర్ హామిల్టన్ చేతికి చిక్కాడు. అయినప్పటికీ కోహ్లీ అదే పట్టుదలతో పోరాడాడు. చూడచక్కని షాట్లతో అలరించాడు. వీలుచిక్కినప్పుడల్లా బౌండరీలు సాధిస్తూ ముందుకు సాగాడు. కానీ బంతిని సరిగా అంచనా వేయలేక హోల్డర్ బౌలింగ్‌లో హామిల్టన్ చేతికి చిక్కాడు.
-
Huge wicket for West Indies!
— ICC (@ICC) August 30, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
West Indies captain Jason Holder removes his opposite number Virat Kohli for 76.
Follow #WIvIND 👇 https://t.co/EnMtwluiaz pic.twitter.com/ZqELw2mOGf
">Huge wicket for West Indies!
— ICC (@ICC) August 30, 2019
West Indies captain Jason Holder removes his opposite number Virat Kohli for 76.
Follow #WIvIND 👇 https://t.co/EnMtwluiaz pic.twitter.com/ZqELw2mOGfHuge wicket for West Indies!
— ICC (@ICC) August 30, 2019
West Indies captain Jason Holder removes his opposite number Virat Kohli for 76.
Follow #WIvIND 👇 https://t.co/EnMtwluiaz pic.twitter.com/ZqELw2mOGf
క్రీజులో విహారి-పంత్..
ఈ మ్యాచ్‌లో పంత్ ఆరంభం నుంచే ఆచితూచి ఆడాడు. అనవసరపు షాట్లకు పోకుండా నిదానంగా తన పోరాటాన్ని సాగించాడు. విహారితో చక్కగా స్ట్రైక్ రొటేట్ చేస్తూ ఇన్నింగ్స్ నడిపించాడు. వీరిద్దరూ మరో వికెట్ పడకుండా విండీస్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్నారు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి 62 పరుగుల విలువైన భాగస్వామ్యం నెలకొల్పి అజేయంగా కొనసాగుతున్నారు.
కార్న్‌వాల్.. ఆగయా..
భారీకాయుడు రకీమ్ కార్న్‌వాల్ అరంగేట్రం చేశాడు. 6.6 అడుగుల ఈ ఆఫ్‌స్పిన్ ఆల్‌రౌండర్ బరువు ఏకంగా 140 కిలోలు. టెస్టు క్రికెట్ ఆడిన అత్యంత బరువైన క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు. కమిన్స్ స్థానంలో తుది జట్టులో చోటు దక్కించుకున్నాడు. పుజారాను ఔట్ చేసి తొలి అంతర్జాతీయ వికెట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు.
తొలి రోజు ఆటలో మొత్తం 27 ఓవర్లు బౌలింగ్ చేసిన ఈ బాహుబలి క్రికెటర్... 8 ఓవర్లు మెయిడిన్ చేయగా ఒక వికెట్ పడగొట్టి 69 పరుగులిచ్చాడు. ఫీల్డర్‌గా స్లిప్‌లో రెండు క్యాచ్‌లు పట్టుకున్నాడు.
వెస్టిండీస్ వికెట్‌కీపర్ హామిల్టన్‌కూ ఇదే అరంగేట్ర మ్యాచ్. షై హోప్ స్థానంలో తుది జట్టులో స్థానం దక్కించుకున్నాడు. ఈ ఆటగాడు మ్యాచ్‌లో రెండు కీలక క్యాచ్‌లు అందుకున్నాడు.