మొహాలీ వేదికగా భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరిగిన టీ20 మ్యాచ్‌లో కోహ్లీసేన 7 వికెట్ల తేడాతో గెలిచింది. 150 పరుగుల లక్ష్యాన్ని 19 ఓవర్లలోనే ఛేదించింది టీమిండియా. విరాట్ అర్ధశతకంతో రాణించగా.. ధావన్ మంచి ప్రదర్శన చేశాడు. కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన కోహ్లీకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఆవార్డు దక్కింది.
-
1-0 🇮🇳🇮🇳 #TeamIndia wrap the 2nd T20I by 7 wickets #INDvSA @paytm pic.twitter.com/GW0FBddf3k
— BCCI (@BCCI) September 18, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">1-0 🇮🇳🇮🇳 #TeamIndia wrap the 2nd T20I by 7 wickets #INDvSA @paytm pic.twitter.com/GW0FBddf3k
— BCCI (@BCCI) September 18, 20191-0 🇮🇳🇮🇳 #TeamIndia wrap the 2nd T20I by 7 wickets #INDvSA @paytm pic.twitter.com/GW0FBddf3k
— BCCI (@BCCI) September 18, 2019
ధావన్ శుభారంభం...
క్రీజులో నిలదొక్కుకొనేందుకు ఆరంభం నుంచే నెమ్మదిగా ఆడిన రోహిత్.. ఆ తర్వాత వరుసగా రెండు సిక్సర్లు బాదాడు. అయితే అదే జోష్‌ను ప్రదర్శించే క్రమంలో ఫెలుక్వాయో బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. రోహిత్ 12 పరుగుల(12 బంతుల్లో)వ్యక్తిగత స్కోరు వద్ద ఔటవడం వల్ల 33 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది టీమిండియా.
మరో ఓపెనర్ శిఖర్ ధావన్ 40 పరుగులు (31 బంతుల్లో; 4ఫోర్లు, 1 సిక్సర్)చేశాడు. చాలా రోజుల తర్వాత ధావన్ తనదైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. అర్ధశతకం చేసే ఊపులో మిల్లర్ పట్టిన అద్భుతమైన క్యాచ్‌కు పెవిలియన్ చేరాడు. రోహిత్ ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీతో కలిసి 61 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు ధావన్.
-
That's a 50-run partnership between @imVkohli & @SDhawan25 👌👌
— BCCI (@BCCI) September 18, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
Live - https://t.co/IApWLYsXvx #INDvSA pic.twitter.com/JP7iQTfQ4r
">That's a 50-run partnership between @imVkohli & @SDhawan25 👌👌
— BCCI (@BCCI) September 18, 2019
Live - https://t.co/IApWLYsXvx #INDvSA pic.twitter.com/JP7iQTfQ4rThat's a 50-run partnership between @imVkohli & @SDhawan25 👌👌
— BCCI (@BCCI) September 18, 2019
Live - https://t.co/IApWLYsXvx #INDvSA pic.twitter.com/JP7iQTfQ4r
సారథి సత్తా...
ప్రపంచకప్, వెస్టిండీస్ పర్యటనలో తిరుగులేని ఫామ్ కనబరిచిన విరాట్ కోహ్లీ.. మరోసారి తన జోరు చూపించాడు. 72 పరుగులు (52 బంతుల్లో; 4 ఫోర్లు, 3సిక్సర్లు)చేసి భారత జట్టును విజయతీరాలకు చేర్చాడు. యువ ఆటగాడు రిషబ్ పంత్(4) మరోసారి విఫలమయ్యాడు. చివర్లో వచ్చిన శ్రేయస్ అయ్యర్ 16 పరుగులు(14 బంతుల్లో; 2ఫోర్లు)రాణించాడు. ఫలితంగా సిరీస్‌లో తొలి విజయాన్ని ఖాతాలో వేసుకుని 1-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది టీమిండియా.
దక్షిణాఫ్రికా బౌలర్లలో ఫెలుక్వాయో, తబ్రేజ్, ఫార్చూన్ తలో వికెట్ తీసుకున్నారు.
డికాక్ వల్లే...
టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన దక్షిణాఫ్రికాకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్‌గా బరిలోకి దిన రీజా హెండ్రిక్స్(6) తక్కువ పరుగులకే ఔటయ్య్డాడు. మరో ఓపెనర్ డికాక్ అర్ధశతకంతో రాణించి జట్టును నడిపించాడు. 37 బంతుల్లో 52 పరుగులు(8 ఫోర్లు) సాధించాడు. ఫలితంగా టీ-20ల్లో టీమిండియాపై భారత్‌లో అత్యధిక రన్స్ చేసిన కెప్టెన్‌గా రికార్డూ సృష్టించాడు.
-
CAPTAIN QDK💪| SA 149/5, after 20 overs
— Cricket South Africa (@OfficialCSA) September 18, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
Highest scores by a 🇿🇦 South African captain v India 🇮🇳 in T20I’s outside of South Africa 👇#INDvSA #ProteaFire pic.twitter.com/slyxMj9I3K
">CAPTAIN QDK💪| SA 149/5, after 20 overs
— Cricket South Africa (@OfficialCSA) September 18, 2019
Highest scores by a 🇿🇦 South African captain v India 🇮🇳 in T20I’s outside of South Africa 👇#INDvSA #ProteaFire pic.twitter.com/slyxMj9I3KCAPTAIN QDK💪| SA 149/5, after 20 overs
— Cricket South Africa (@OfficialCSA) September 18, 2019
Highest scores by a 🇿🇦 South African captain v India 🇮🇳 in T20I’s outside of South Africa 👇#INDvSA #ProteaFire pic.twitter.com/slyxMj9I3K
సారథికి తోడుగా భవుమా 49 పరుగులు (43 బంతుల్లో; 3 ఫోర్లు, 1సిక్సర్) చేసి తృటిలో అర్ధశతకం కోల్పోయాడు. డసెన్(1), మిల్లర్(18), ప్రిటోరియస్(1) తక్కువ పరుగులు చేశారు.
భారత బౌలర్లలో దీపక్ చాహర్ పొదుపుగా బౌలింగ్ చేశాడు. 4 ఓవర్లలో 22 పరుగులిచ్చి రెండు వికెట్లు తీశాడు. సైనీ, జడేజా, హార్దిక్ పాండ్య తలో వికెట్ తీసుకున్నారు.
ఇప్పటికే ధర్మశాలలో జరగాల్సిన తొలి టీ20 వర్షం కారణంగా రద్దయింది. మూడో మ్యాచ్ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా 22న జరగనుంది. ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా గెలిస్తే సిరీస్ సమం అవుతుంది.