తొలిసారి స్వదేశంలో దక్షిణాఫ్రికాపై టీ20 కప్పు గెలవాలన్న టీమిండియా ఆశకు చెక్ పడింది. టీ20 ప్రపంచకప్ ముందు వరుస విజయాలతో దూసుకెళ్తోన్న కోహ్లీ సేనకు... బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో షాకిచ్చింది సఫారీ జట్టు. ఆదివారం జరిగిన చివరి టీ20లో సఫారీ జట్టు 9 వికెట్ల తేడాతో గెలిచింది. దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్ డికాక్ అర్ధశతకంతో రాణించాడు.
-
RESULT| SOUTH AFRICA WIN BY 9 WICKETS.
— Cricket South Africa (@OfficialCSA) September 22, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
A comprehensive nine-wicket win to level the series for South Africa. Quinton de Kock was dominant and classy, Beuran Hendricks fantastic with the ball. #INDvSA #ProteaFire pic.twitter.com/arwsvoD4t3
">RESULT| SOUTH AFRICA WIN BY 9 WICKETS.
— Cricket South Africa (@OfficialCSA) September 22, 2019
A comprehensive nine-wicket win to level the series for South Africa. Quinton de Kock was dominant and classy, Beuran Hendricks fantastic with the ball. #INDvSA #ProteaFire pic.twitter.com/arwsvoD4t3RESULT| SOUTH AFRICA WIN BY 9 WICKETS.
— Cricket South Africa (@OfficialCSA) September 22, 2019
A comprehensive nine-wicket win to level the series for South Africa. Quinton de Kock was dominant and classy, Beuran Hendricks fantastic with the ball. #INDvSA #ProteaFire pic.twitter.com/arwsvoD4t3
కెప్టెన్ ఇన్నింగ్స్...
భారత్ ఇచ్చిన 135 పరుగుల లక్ష్యాన్ని... వికెట్ కోల్పోయి ఛేదించేసింది దక్షిణాఫ్రికా. ఛేజింగ్‌లో సఫారీ జట్టు సారథి, ఓపెనర్ క్వింటన్ డికాక్ 76 పరుగులు* (52 బంతుల్లో 6 ఫోర్లు, 5సిక్సర్లు) చెలరేగిపోయాడు. భారత బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఆకాశమే హద్దుగా చెలరేగి ఆడి... తన జట్టుకు ఘన విజయం అందించాడు.
మరో ఓపెనర్ హెండ్రిక్స్ 28 పరుగులతో (26 బంతుల్లో 4 ఫోర్లు) మంచి ఆరంభాన్నిచ్చాడు. తొలి వికెట్‌గా వచ్చిన భవుమా 27 పరుగులు (23 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్సర్) చేసి సారథికి మంచి సహకారం ఇచ్చాడు.
-
Congratulations @QuinnyDeKock69 👏 pic.twitter.com/asqTvNhNsB
— ICC (@ICC) September 22, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Congratulations @QuinnyDeKock69 👏 pic.twitter.com/asqTvNhNsB
— ICC (@ICC) September 22, 2019Congratulations @QuinnyDeKock69 👏 pic.twitter.com/asqTvNhNsB
— ICC (@ICC) September 22, 2019
భారత బౌలర్లలో పాండ్యా 11కు పైగా సగటుతో పరుగులిచ్చినా ఒక వికెట్ తీశాడు. జడేజా మినహా ఇతర బౌలర్లందరూ భారీగానే పరుగులిచ్చుకున్నారు.
ఈ విజయంతో సిరీస్‌ను 1-1తో సమం చేసింది డికాక్ సేన.. తొలి టీ20 వర్షం కారణంగా రద్దవ్వగా... రెండో మ్యాచ్‌లో భారత జట్టు 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
-
Captain de Kock (79*) guides South Africa to a 9-wicket win. The series ends with a 1-1 reading #TeamIndia #INDvSA @Paytm pic.twitter.com/FvhZuGfnCU
— BCCI (@BCCI) September 22, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Captain de Kock (79*) guides South Africa to a 9-wicket win. The series ends with a 1-1 reading #TeamIndia #INDvSA @Paytm pic.twitter.com/FvhZuGfnCU
— BCCI (@BCCI) September 22, 2019Captain de Kock (79*) guides South Africa to a 9-wicket win. The series ends with a 1-1 reading #TeamIndia #INDvSA @Paytm pic.twitter.com/FvhZuGfnCU
— BCCI (@BCCI) September 22, 2019
బ్యాటింగ్‌లో విఫలం...
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కోహ్లీసేనకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ రోహిత్‌శర్మ(9) సిరీస్‌లో మరోసారి పేలవ ప్రదర్శన చేశాడు. మరో ఓపెనర్ శిఖర్ ధావన్ 36 పరుగులతో(25 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లు) మరోసారి రాణించాడు. హిట్‌మ్యాన్ ఔట్ తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ కోహ్లీ 9 పరుగులకే పెవిలియన్ చేరాడు.ఈ టోర్నీలో ప్రదర్శన కారణంగా నిరాశ ఎదుర్కొంటున్న రిషబ్ పంత్ 19 పరుగులు(20 బంతుల్లో 1ఫోర్, 1 సిక్సర్) మెరుగయ్యాడు.
సఫారీల పేస్ ధాటికి మిగతా బ్యాట్స్‌మెన్ శ్రేయస్ అయ్యర్(5), కృనాల్ పాండ్య(5) దారుణంగా విఫలమయ్యారు. ఆల్‌రౌండర్లు హార్దిక్ పాండ్య 14 పరుగులు(18 బంతుల్లో 1 ఫోర్), రవీంద్ర జడేజా 19 రన్స్(17 బంతుల్లో 1 ఫోర్, 1సిక్సర్) ఫర్వాలేదనిపించారు. వీరిద్దరి వల్లే స్కోరు ఆ మాత్రమైనా వచ్చింది.
-
Innings Break!
— BCCI (@BCCI) September 22, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
After opting to bat first, #TeamIndia post a total of 134/9 after 20 overs.
Updates - https://t.co/LcO4kVOSNZ #INDvSA pic.twitter.com/sfKMNpr4GI
">Innings Break!
— BCCI (@BCCI) September 22, 2019
After opting to bat first, #TeamIndia post a total of 134/9 after 20 overs.
Updates - https://t.co/LcO4kVOSNZ #INDvSA pic.twitter.com/sfKMNpr4GIInnings Break!
— BCCI (@BCCI) September 22, 2019
After opting to bat first, #TeamIndia post a total of 134/9 after 20 overs.
Updates - https://t.co/LcO4kVOSNZ #INDvSA pic.twitter.com/sfKMNpr4GI
దక్షిణాఫ్రికా బౌలర్లలో రబాడా 3 వికెట్లు, ఫార్చ్యూన్, హెండ్రిక్స్ చెరో 2 వికెట్లు తీసుకున్నారు. షంశీ ఒక వికెట్ ఖాతాలో వేసుకున్నాడు.