భారత బ్యాట్స్మెన్ల ఘోరవైఫల్యంతో న్యూజిలాండ్‌తో రెండో టెస్టులో విజయావకాశాలు దాదాపు దూరమయ్యాయి. 90/6తో మూడో రోజు ఆట కొనసాగించిన టీమిండియా మరో 34 పరుగులు జోడించి మిగతా నాలుగు వికెట్లను కోల్పోయింది. కివీస్ ముందు 132 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఉంచింది.
మూడో రోజు ఆట మూడో ఓవర్లోనే సౌథీ బౌలింగ్‌లో వెనుదిరిగాడు హనుమ విహారి(9). మరుసటి ఓవర్లోనే పంత్(4)ను పెవిలియన్ బాట పట్టించాడు బౌల్ట్. జడేజా 16 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. బుమ్రా(4) ఆఖరి వికెట్‌గా వెనుదిరిగాడు. న్యూజిలాండ్ బౌలర్లలో బౌల్ట్ 4, సౌథీ 3 వికెట్లు దక్కించుకున్నారు.
మరో రెండు రోజుల ఆట మిగిలున్న నేపథ్యంలో భారత్ గెలవాలంటే మన బౌలర్లు తీవ్రంగా శ్రమించాలి.