నిర్ణయాత్మక మూడో వన్డేలో భారత్ ధనాధన్ బ్యాటింగ్ చేసింది. 48.2 ఓవర్లలో 329 పరుగులకు ఆలౌటైంది. ధావన్(67), పంత్(78), హార్దిక్ పాండ్య(64) అర్ధ శతకాలతో అదరగొట్టారు.
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఓపెనర్లు రోహిత్-ధావన్ శుభారంభం అందించారు. తొలి వికెట్‌కు 103 పరుగులు జోడించారు. ఈ క్రమంలో వన్డేల్లో 5000 పరుగుల మార్క్‌ను అందుకున్న రెండో భారత జోడీగా నిలిచాడు. అనంతరం 37 పరుగులు చేసిన రోహిత్ ఔటయ్యాడు. కొద్దిసేపటికే 67 పరుగుల వద్ద ధావన్ కూడా పెవిలియన్ చేరాడు.
ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన పంత్-హార్దిక్ పాండ్య.. ప్రత్యర్థి బౌలర్లకు అవకాశం ఇవ్వకుండా ఆకాశమే హద్దుగా చెలరేగారు. నాలుగో వికెట్‌కు 99 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అనంతరం వరుసగా హాఫ్ సెంచరీలు చేసి ఔటయ్యారు. మిగతా వారిలో కోహ్లీ(7), కేఎల్ రాహుల్(7), కృనాల్ పాండ్య(25), శార్దుల్ ఠాకుర్(30) తమ వంతు పాత్ర పోషించారు.
ఇంగ్లాండ్ బౌలర్లలో మార్క్ వుడ్3, రషీద్ 2 వికెట్లు తీయగా.. మొయిన్ అలీ, స్టోక్స్, రీసి, లివింగ్‌స్టోన్, సామ్ కరన్ తలో వికెట్ పడగొట్టారు.