పుణె వేదికగా ఇంగ్లాండ్‌తో తొలి మ్యాచ్‌లో వన్డేల్లోకి అరంగేట్రం చేశాడు ముంబయి ఇండియన్స్ ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్యా. మ్యాచ్‌కు ముందు అతని సోదరుడు హార్దిక్ పాండ్యా ఇచ్చిన క్యాప్‌ను అందుకున్న కృనాల్.. భావోద్వేగానికి లోనయ్యాడు. హార్దిక్ భుజంపై తల పెట్టి ఆనందబాష్పాలు రాల్చాడు. తర్వాత జట్టు సభ్యులు అతనికి శుభాకాంక్షలు తెలిపారు.
ఇప్పటికే టీ20ల్లో టీమ్ఇండియాకు ఆడిన కృనాల్.. తాజాగా 50 ఓవర్ల ఫార్మాట్లోకి అడుగు పెట్టాడు. పొట్టి ఫార్మాట్లో 18 మ్యాచ్‌లు ఆడిన కృనాల్.. 26 సగటుతో 121 పరుగులు సాధించాడు. గత ఐపీఎల్‌తో పాటు ఈ ఏడాది జరిగిన విజయ్ హజారే ట్రోఫీలో నిలకడగా రాణించిన పాండ్యను.. జాతీయ జట్టు తలుపుతట్టింది. హజారే టోర్నీలో 5 ఇన్నింగ్స్‌ల్లో 388 పరుగులు చేశాడు.
వీరిద్దిరి తొలి మ్యాచ్ సందర్భంగా బీసీసీఐ ట్వీట్టర్ వేదికగా స్పందించింది. 'కృనాల్ వన్డే అరంగేట్రం, ప్రసిద్ధ్ క్రిష్ణ అంతర్జాతీయ అరంగేట్రం' అని ట్వీట్ చేసింది.
కోల్‌కతా నైట్ రైడర్స్ ఫాస్ట్ బౌలర్ ప్రసిద్ధ్ క్రిష్ణ గత నాలుగైదు ఏళ్ల నుంచి స్థిరమైన ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు. 2017-18 హజారే ట్రోఫీలో కర్ణాటక జట్టు ఫైనల్ చేరడంలో కీలక పాత్ర పోషించాడు. 2019-20 సీజన్లోనూ 17 వికెట్లతో సత్తా చాటాడు.
ఇదీ చదవండి: ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్: అగ్రస్థానానికి షెఫాలీ