టీమిండియా ఓపెనర్ రోహిత్‌శర్మ, బౌలర్ చాహల్.. అద్భుత ప్రదర్శనలు చేస్తూ దూసుకుపోతున్నారు. టీ20ల్లో వీరిద్దరి కోసం చెరో రికార్డు వేచిచూస్తోంది. ఇందుకోసం రోహిత్ రెండు సిక్సర్లు కొట్టాల్సి ఉండగా... చాహల్ ఒక వికెట్ తీయాలి.
సిక్సర్ల పిడుగు...
అంతర్జాతీయ క్రికెట్‌లో మరో రెండు సిక్సర్లు కొడితే... భారత్ తరఫున 400 సిక్సర్లు కొట్టిన తొలి క్రికెటర్‌గా రోహిత్ రికార్డు సృష్టిస్తాడు. బంగ్లాదేశ్‌తో రాజ్‌కోట్‌లో జరిగిన రెండో టీ20లో ఆరు సిక్సర్లు బాదిన హిట్‌మ్యాన్.. ప్రస్తుతం 398 సిక్సర్లతో కొనసాగుతున్నాడు.
అత్యధిక సిక్సర్లు కొట్టిన వారిలో వెస్టిండీస్ విధ్వంసక క్రికెటర్ క్రిస్‌గేల్(534) టాప్‌లో, పాకిస్థాన్ మాజీ ఆల్‌రౌండర్ షాహిద్ అఫ్రిది(476) తర్వాత స్థానంలో ఉన్నారు.
రోహిత్ 400 మార్కును అందుకుంటే.. ఈ ఘనత సాధించిన మూడో బ్యాట్స్‌మన్‌గా నిలుస్తాడు. ఇప్పటివరకు వన్డేల్లో 232, టెస్టుల్లో 51, టీ20ల్లో 115 సిక్సర్లు కొట్టాడు హిట్‌మ్యాన్.
స్పిన్ మంత్రం...
అంతర్జాతీయ టీ20ల్లో మరో వికెట్ తీస్తే 50 వికెట్ల మైలురాయి అందుకున్న మూడో ఆటగాడిగా చాహల్ ఘనత సాధిస్తాడు. ఈ ఫార్మాట్లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన జాబితాలో అశ్విన్(52), బుమ్రా(51) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు.
ప్రస్తుతం జరుగుతున్న సిరీస్‌లో తొలి టీ20లో బంగ్లాదేశ్ గెలిచింది. రెండో మ్యాచ్‌లో భారత్ విజయం సాధించింది. సిరీస్ 1-1తో సమం చేసింది. నిర్ణయాత్మక చివరి టీ20 నాగ్‌పూర్‌లో ఈ ఆదివారం జరగనుంది.