ETV Bharat / sports

'భారత్- ఆసీస్​​ సిరీస్​ ఎందుకంత కీలకమంటే'

కరోనా అనంతరం టీమ్​ఇండియా వెళ్లనున్న ఆస్ట్రేలియా పర్యటన కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దీంతో అంతర్జాతీయ క్రికెట్​లో ఈ సిరీస్​కు ప్రాధాన్యం సంతరించుకుంది. తాజాగా, ఈ విషయంపై ఆసీస్​ మాజీ క్రికెటర్​ బ్రెట్​ లీ ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.

India vs Australia Test series the best rivalry, at par with Ashes, says Brett Lee
'ఆస్ట్రేలియా-భారత్​ సిరీస్​ ఎందుకంత కీలకమంటే'
author img

By

Published : Jul 20, 2020, 5:03 PM IST

ఈ ఏడాది చివర్లో ఆస్ట్రేలియా పర్యటనకు టీమ్​ఇండియా సన్నాహాలు ప్రారంభించింది. కరోనా కారణంగా ఏర్పడిన సుదీర్ఘ విరామం అనంతరం ఇప్పుడిప్పుడే క్రికెట్​ పునఃప్రారంభమవుతున్న వేళ.. ఈ సిరీస్​కు ప్రాధాన్యత సంతరించుకుంది. ఇరు జట్ల మధ్య జరిగే టోర్నీ కోసం అభిమానులు, బోర్డులు, ప్రసార కర్తలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇందుకు కారణాలూ లేకపోలేదు. అంతర్జాతీయ క్రికెట్​లో రెండు ఉత్తమ జట్లు తలపడనుండగా.. కరోనా అనంతరం ప్రపంచంలో అత్యధిక ప్రాధాన్యం సంతరించుకున్న క్రికెట్​ సిరీస్​ ఇదే కావడం విశేషం. ఆర్థిక పరంగా ఆస్ట్రేలియా క్రికెట్​కూ ఎంతో కీలకమైన సిరీస్​​ ఇది. ఈ క్రమంలోనే అంతర్దాతీయ క్రికెట్​కు భారత్​- ఆస్ట్రేలియా మధ్య జరిగే సిరీస్​ను​ కీలకంగా ఎందుకు భావిస్తున్నారనే విషయంపై ఆసీస్​ మాజీ క్రికెటర్​ బ్రెట్​ లీ వివరించాడు.

"ఈ పర్యటన చాలా ముఖ్యమైంది. ఎప్పుడైనా భారత్, -ఆస్ట్రేలియా పర్యటనకు వచ్చినా. లేదా మేము అక్కడికి వెళ్లనా. ఇది యాషెస్​తో సమానంగా ఉంటుంది. ఈ సిరీస్ ఎప్పటికీ కీలకమైందే. ఆస్ట్రేలియా టెస్టు సిరీస్​లో భారత్​తో ఆడుతున్నప్పుడు.. కచ్చితంగా ఉత్తమమైన పోటీ తత్వాన్ని కలిగి ఉంటుందని నమ్ముతున్నా. ఇరు దేశాలు క్రికెట్​ను ఎంతగానో ఆరాధిస్తాయి".

-బ్రెట్​ లీ, ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్​

ఆస్ట్రేలియా పర్యటన భారత అభిమానులకే కాక... క్రికెటర్లు, ఆస్ట్రేలియా బోర్డుకూ ఎంతో కీలకమైనదని బ్రెట్ లీ పునరుద్గాటించాడు. మరోవైపు ఈ ఏడాది అక్టోబరులో ఆస్ట్రేలియా వేదికగా జరగాల్సిన టీ20 ప్రపంచకప్ నిర్వహణపై కరోనా వల్ల అనిశ్చితి నెలకొంది. ఈ విషయంపై స్పందించిన బ్రెట్​లీ.. మెగా టోర్నమెంట్​ను ఐసీసీ వాయిదా వేస్తుందని భావిస్తున్నట్లు తెలిపాడు.

2018-19లో భారత్​ ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా విరాట్​ కోహ్లీ సారథ్యంలోని జట్టు ఆసీస్​ను 2-1 తేడాతో ఓడించి ట్రోఫీని కైవసం చేసుకుంది. కంగారూ గడ్డపై విజయం సాధించిన తొలి భారత జట్టుగా రికార్డు సృష్టించింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.