ETV Bharat / sports

మూడో వన్డే: నల్ల బ్యాండ్​ల​తో భారత జట్టు.. ఎందుకంటే? - former all-rounder Bapu Nadkarni

చిన్నస్వామి వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో వన్డేలో.. చేతికి నల్ల బ్యాండ్​లు ధరించి మైదానంలోకి దిగింది టీమిండియా. భారత మాజీ ఆల్‌రౌండర్‌ రమేశ్‌ చంద్ర గంగారం బాపూ నడ్‌కర్ణి(86) శుక్రవారం కన్నుమూసిన నేపథ్యంలో.. ఆయనకు నివాళిగా ఆటగాళ్లు నలుపు బ్యాండ్​లు ధరించారు.

Indian team members wear black arm bands to honour Bapu Nadkarni
నల్ల బ్యాండ్​లు ధరించిన భారత జట్టు.. ఎందుకంటే..?
author img

By

Published : Jan 19, 2020, 2:23 PM IST

భారత్-ఆస్ట్రేలియా మధ్య ఆసక్తికర పోరు సాగుతోంది. చిన్నస్వామి స్టేడియం వేదికగా జరుగుతున్న ఆఖరి వన్డేలో భారత ఆటగాళ్లు... నలుపు రంగు బ్యాండ్​లు ధరించిన మైదానంలోకి దిగారు. ఇందుకు కారణం ఉంది. భారత మాజీ ఆల్‌రౌండర్‌ రమేశ్‌ చంద్ర గంగారం బాపూ నడ్‌కర్ణి(86) శుక్రవారం కన్నుమూశారు. ఆయనకు నివాళిగా భారత ఆటగాళ్లు నల్ల బ్యాండ్​లు ధరించారు.

రికార్డు మెయిడెన్లు...

1964లో పర్యాటక జట్టు ఇంగ్లాండ్​తో టెస్టు సిరీస్​లోని తొలి మ్యాచ్​లో ఈయన వరసగా 21 మెయిడెన్ ఓవర్లు వేసి రికార్డు సృష్టించి, చరిత్రలోకెక్కాడు. తన కెరీర్​లో మొత్తంగా 41 టెస్టులాడి, 1414 పరుగులు చేశారు. 88 వికెట్లు పడగొట్టారు. 6/43.. బాపు కెరీర్​లో అత్యుత్తమ గణాంకాలు.

జాతీయ ఎంపిక సంఘ సభ్యుడిగా కూడా సేవలు అందించారు బాపు. ముంబయి క్రికెట్‌ అసోసియేషన్‌కు సంయుక్త కార్యదర్శిగానూ వ్యవహరించారు. ఆయన మరణం క్రికెట్‌కు తీరని లోటని బీసీసీఐ సంతాపం తెలిపింది. బాపు మరణంపై దిగ్గజ సచిన్ తెందుల్కర్ ట్వీట్ చేశాడు. ఆయన 21 మెయిడెన్ ఓవర్ల రికార్డులు చూస్తూనే పెరిగానని రాసుకొచ్చాడు. ఆయన లేని లోటు తీర్చలేనిదని, నడ్కర్ణి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపాడు.

India vs Australia 3rd ODI
రమేశ్‌ చంద్ర గంగారం బాపూ నడ్‌కర్ణి

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.

Copyright 2013 CCTV. All rights reserved.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.