ద్వైపాక్షిక వన్డే సిరీస్ ట్రోఫీ కోసం కోసం భారత్, ఆసీస్ జట్ల మధ్య ఆఖరి పోరు మొదలైంది. ఇప్పటికే మూడు వన్డేల సిరీస్‌లో ఇరుజట్లు ఒక్కో మ్యాచ్ గెలిచి 1-1 తేడాతో సిరీస్ సమం చేసుకున్నాయి. నేడు నిర్ణయాత్మక మ్యాచ్‌లో ఎవరు విజేతగా నిలిస్తే.. వారే ట్రోఫీ కైవసం చేసుకోనున్నారు.
టాస్ గెలిచి ఆసీస్ బ్యాటింగ్...
ఈ మ్యాచ్‌లో ముందుగా టాస్ గెలిచిన ఆసీస్ సారథి ఫించ్... బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఆస్ట్రేలియా ఒక మార్పుతో బరిలోకి దిగుతోంది. రిచర్డ్సన్ స్థానంలో హేజిలవుడ్ బరిలోకి దిగుతున్నాడు.

భారత్.. రెండో వన్డే జట్టుతోనే మ్యాచ్ ఆడనున్నారు. ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతోంది. రోహిత్, శిఖర్ ఈ మ్యాచ్‌లో ఓపెనర్లుగా బరిలోకి దిగుతున్నారు.
ఇవీ ఇరుజట్లు...
- భారత్: ధావన్, రోహిత్, రాహుల్(కీపర్), కోహ్లీ (కెప్టెన్), శ్రేయస్, మనీశ్ పాండే, జడేజా, కుల్దీప్, షమి, బుమ్రా, సైనీ
- ఆస్ట్రేలియా: వార్నర్, ఫించ్ (కెప్టెన్), స్టీవ్ స్మిత్, లబుషేన్, టర్నర్, కేరీ, అగర్, కమిన్స్, స్టార్క్, హేజిల్‌వుడ్, ఆడం జంపా.
పరుగుల వరదే...
చిన్నస్వామి స్టేడియంలో పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలించనుంది. భారీ స్కోర్లు నమోదు కావొచ్చు. రెండోసారి బౌలింగ్ చేసే జట్టు మంచు వల్ల ఇబ్బందిపడే అవకాశముంది. మ్యాచ్‌కు వర్షం ముప్పు లేదు.
>> భారత్, ఆస్ట్రేలియా జట్లు బెంగళూరులో రెండు వన్డేల్లో తలపడ్డాయి. ఈ మ్యాచ్‌ల్లో ఇరుజట్లు కలిసి ఒక మ్యాచ్‌లో 709 , మరో మ్యాచ్‌లో 647 పరుగులు చేశాయి.
>> ఇక్కడ ఆడిన మూడు వన్డేల్లో రోహిత్ శర్మ చేసిన 318 పరుగులు చేశాడు. ఇందులో ఓ డబుల్ సెంచరీ కూడా ఉంది.