ETV Bharat / sports

జూన్​ 18-22: డబ్ల్యూటీసీ ఫైనల్లో భారత్​X కివీస్ 'ఢీ'

ఇంగ్లాండ్​తో చివరి టెస్టులో నెగ్గిన టీమ్​ఇండియా ప్రపంచ టెస్టు ఛాంపియన్​ షిప్​ ఫైనల్లోకి దూసుకెళ్లింది. జూన్​ 18-22 మధ్య లార్డ్స్​ వేదికగా జరిగే తుది పోరులో న్యూజిలాండ్​తో తలపడనుంది.

India to play WTC finals against New Zealand
డబ్ల్యూటీసీ: భారత్​ టాప్​- జూన్​ 18-22 మధ్య కివీస్​తో ఢీ​
author img

By

Published : Mar 6, 2021, 5:35 PM IST

జూన్​ 18.. గుర్తుపెట్టుకోవాల్సిన తేదీ. ఆ రోజే భారత్​, న్యూజిలాండ్​ మధ్య ప్రతిష్ఠాత్మక లార్డ్స్​ మైదానంలో ప్రపంచ టెస్టు ఛాంపియన్​ షిప్(డబ్ల్యూటీసీ)​ ఫైనల్​ మొదలయ్యేది. ఇంగ్లాండ్​ను చివరిదైన నాలుగో టెస్టులో చిత్తుగా ఓడించిన కోహ్లీ సేన.. రాజసంగా తుది పోరుకు అర్హత సాధించింది. డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది.

ఈ మేరకు అంతర్జాతీయ క్రికెట్​ మండలి(ఐసీసీ) ట్వీట్​ చేసింది. జూన్​ 18 నుంచి 5 రోజుల పాటు ఈ ఫైనల్​ టెస్టు జరగనుంది. జూన్​ 23ను రిజర్వ్​ డే గా ప్రకటించింది.

'' ఇంగ్లాండ్​పై గెలుపు అనంతరం.. ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్​ షిప్​ లీగ్​ దశను భారత్​ అగ్రస్థానంతో ముగించింది.''

- ఐసీసీ ట్వీట్​

భారత్​ ఫైనల్​ చేరిందిలా..

లీగ్​ దశలో టీమ్​ఇండియా 6 సిరీస్​ల్లో 12 విజయాలతో 520 పాయింట్లు సాధించింది. విజయం శాతం 72.2. నాలుగింట్లో ఓడగా.. ఒక మ్యాచ్​ డ్రా అయింది.

రెండో స్థానంలో నిలిచిన న్యూజిలాండ్​.. 5 సిరీస్​ల్లో 7 గెలవగా.. నాలుగింట ఓడింది. విజయం శాతం 70. 420 పాయింట్లు సొంతం చేసుకుంది. ఆస్ట్రేలియాతో జరగాల్సిన టెస్టు సిరీస్​ వాయిదా పడటంతో.. కివీస్​ కాస్త ముందుగానే ఫైనల్​కు అర్హత సాధించింది.

ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్​, పాకిస్థాన్​ వరుసగా ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

ఇదీ చదవండి:బక్సమ్​ టోర్నీ: ఫైనల్లోకి మనీష్, వికాస్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.