భారత్‌తో జరుగుతున్న మూడో టీ 20లో వెస్టిండీస్ 6 వికెట్లు కోల్పోయి 146 పరుగులు చేసింది. గయానా వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ టీమిండియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్ ఆరంభించిన విండీస్ బ్యాట్స్‌మెన్‌లో కీరన్ పొలార్డ్(58), పావెల్(32) మినహా మిగతా వారు పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. భారత బౌలర్లలో దీపక్ చాహర్ 3, నవదీప్ సైనీ 2 వికెట్లతో రాణించారు.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన విండీస్ ఆరంభంలోనే ఓపెనర్ సునీల్ నరైన్(2) వికెట్ కోల్పోయింది. దీపక్ చాహర్ బౌలింగ్‌లో సైనికి క్యాచ్ ఇచ్చాడు నరైన్. అనంతరం కాసేపటికే లూయిస్(10), హిట్మైర్(1) వికెట్లు కోల్పోయింది విండీస్ జట్టు.14 పరుగులకే 3 కీలక వికెట్లు చేజార్చుకుని పీకల్లోతు కష్టాల్లో పడింది.
-
🌴v 🇮🇳
— Windies Cricket (@windiescricket) August 6, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
WI 125/5 (17.1 ov)
Live Scorecard
⬇️⬇️⬇️⬇️⬇️https://t.co/r9G2XSfv0f pic.twitter.com/GucJ5NUiQ0
">🌴v 🇮🇳
— Windies Cricket (@windiescricket) August 6, 2019
WI 125/5 (17.1 ov)
Live Scorecard
⬇️⬇️⬇️⬇️⬇️https://t.co/r9G2XSfv0f pic.twitter.com/GucJ5NUiQ0🌴v 🇮🇳
— Windies Cricket (@windiescricket) August 6, 2019
WI 125/5 (17.1 ov)
Live Scorecard
⬇️⬇️⬇️⬇️⬇️https://t.co/r9G2XSfv0f pic.twitter.com/GucJ5NUiQ0
అనంతరం క్రీజులోకి వచ్చిన కీరన్ పొలార్డ్.. నికోలస్ పూరన్(17) సాయంతో స్కోరు బోర్డు ముందుకు కదిలించాడు. సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. 40 బంతుల్లో 50 పరుగులు పూర్తి చేశాడు. ఇందులో ఆరు సిక్సర్లు, ఓ ఫోర్ ఉన్నాయి. అనంతరం సైని బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు.
పొలార్డ్ ఔటైన తర్వాత విండీస్ ఆటగాళ్లు నెమ్మదించినా.. ఆఖర్లో దూకుడుగా ఆడారు. ఆరంభంలో పరుగులు కట్టడి చేసిన భారత బౌలర్లు చివర్లో సమర్పించుకున్నారు. విండీస్ బ్యాట్స్‌మన్ పోవెల్(30) సిక్సర్లతో విరుచుకుపడి అనుకున్నకంటే ఎక్కువ స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించాడు.
-
Deepak Chahar you beauty! At it from the word go. Gets rid of Narine, Lewis and Hetmyer.
— BCCI (@BCCI) August 6, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
West Indies 14/3 after 3.5 overs pic.twitter.com/zTbAoipndH
">Deepak Chahar you beauty! At it from the word go. Gets rid of Narine, Lewis and Hetmyer.
— BCCI (@BCCI) August 6, 2019
West Indies 14/3 after 3.5 overs pic.twitter.com/zTbAoipndHDeepak Chahar you beauty! At it from the word go. Gets rid of Narine, Lewis and Hetmyer.
— BCCI (@BCCI) August 6, 2019
West Indies 14/3 after 3.5 overs pic.twitter.com/zTbAoipndH
అదరగొట్టిన దీపక్..
కెరీర్లో రెండో టీ 20 ఆడుతున్న దీపక్ ఆకట్టుకునే ప్రదర్శన చేశాడు. తను వేసిన తొలి ఓవర్లోనే సునిల్ నరైన్‌ను ఔట్ చేశాడు. అనంతరం ఒకే ఓవర్లో లుయిస్, హిట్మైర్ను ఎల్బీడబ్ల్యూ చేసి పెవిలియన్ చేర్చాడు.
ఇది చదవండి: రెండో టీ20లో రికార్డులే రికార్డులు..!