ETV Bharat / sports

టెస్టు ఛాంపియన్​షిప్: ఇంగ్లాండ్​ టాప్​.. భారత్​ డౌన్​

author img

By

Published : Feb 9, 2021, 3:28 PM IST

ఐసీసీ టెస్టు ఛాంపియన్​షిప్​ ర్యాంకింగ్స్​లో ఇంగ్లాండ్​​ సత్తా చాటింది. టీమ్​ఇండియాపై తొలి టెస్టు​ విజయం తర్వాత ఈ ర్యాంకింగ్స్​లో అగ్రస్థానాన్ని సొంతం చేసుకుంది. ఫలితంగా టెస్టు ఛాంఫియన్​షిప్​ ఫైనల్​లో అర్హత సాధించే అవకాశాల్ని కాపాడుకుంది.

england
ఇంగ్లాండ్​

ఐసీసీ తాజాగా విడుదల చేసిన ప్రపంచ టెస్టు ఛాంపియన్​షిప్​ పాయింట్ల పట్టికలో 70.2 విజయశాతంతో టాపర్​గా నిలిచింది ఇంగ్లాండ్​. మంగళవారం టీమ్​ఇండియాపై తొలి టెస్టు గెలిచిన అనంతరం టేబుల్​లో తన స్థానాన్ని మెరుగుపరుచుకుని అగ్రస్థానానికి ఎగబాకింది. దీంతో ప్రపంచ టెస్టు ఛాంఫియన్​షిప్​ ఫైనల్​లో అర్హత సాధించేందుకు ఆశల్ని సజీవం చేసుకుంది. ఇదే మ్యాచు ఫలితం కారణంగా రెండో స్థానంలో ఉన్న భారత్ 68.3 విజయ శాతంతో​ నాలుగో స్థానానికి పడిపోయింది.

కివీస్​ ప్రత్యర్థి ఎవరు?

ఇప్పటికే న్యూజిలాండ్​​.. ఈ టెస్టు ఛాంపియన్​షిప్​ తుది పోరుకు చేరిన తొలి జట్టుగా నిలిచింది. అయితే కివీస్​ ప్రత్యర్థి స్థానం కోసం భారత్​, ఇంగ్లాండ్​, ఆస్ట్రేలియా జట్లు పోటీ పడుతున్నాయి. కాగా ఇంగ్లాండ్​.. ఈ టెస్టు ఛాంపియన్​షిప్​ ఫైనల్​లో ఆడాలంటే టీమ్​ఇండియాపై 3-1,3-0,4-0 తేడాతో సిరీస్​ గెలిచి తీరాలి. భారత్​ అర్హత సాధించాలంటే ఇంగ్లాండ్​పై 2-1,3-1 తేడాతో సిరీస్​ను సొంతం చేసుకోవాలి. మరోవైపు భారత్​-ఇంగ్లాండ్​ సిరీస్​ డ్రాగా ముగిసినా లేదా ఇంగ్లాండ్​​ 1-0, 2-1,2-0 తేడాతో గెలిచినా కంగారులకు అవకాశాలు ఉంటాయి. కాగా, ఈ పాయింట్ల పట్టికలో న్యూజిలాండ్ 70.0 విజయశాతంతో రెండో స్థానానికి పడిపోగా.. ఆస్ట్రేలియా 69.2 విజయంశాతంతో మూడో స్థానంలో నిలిచింది.

  • Qualification scenarios for the #WTC21 finals:

    India can still qualify if...
    🇮🇳 2-1
    🇮🇳 3-1

    England qualify if...
    🏴󠁧󠁢󠁥󠁮󠁧󠁿 3-0
    🏴󠁧󠁢󠁥󠁮󠁧󠁿 3-1
    🏴󠁧󠁢󠁥󠁮󠁧󠁿 4-0

    Australia qualify if...
    🏴󠁧󠁢󠁥󠁮󠁧󠁿 1-0
    🏴󠁧󠁢󠁥󠁮󠁧󠁿 2-0
    🏴󠁧󠁢󠁥󠁮󠁧󠁿 2-1
    🤝 1-1
    🤝 2-2

    — ICC (@ICC) February 9, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇదీ చూడండి: ఐసీసీ టెస్ట్​ ర్యాంకింగ్స్​: ఐదో స్థానానికి పాకిస్థాన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.