భారత్-పాకిస్థాన్ ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడక దాదాపు 8 ఏళ్లు కావొస్తుంది. ఇరు దేశాల మధ్య సరిహద్దు ఉద్రిక్తతల కారణంగా.. ఆ ప్రభావం క్రికెట్‌పైనా పడింది. కానీ, ఈ సమస్య త్వరలోనే పరిష్కారం కాబోతుందంటుంది ఓ నివేదిక. ఈ ఏడాదే రెండు దేశాల మధ్య 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరగనుందని వెల్లడించింది.
పాకిస్థాన్ వార్తా పత్రిక 'జాంగ్' ప్రకారం.. దాయాదితో టీమ్‌ఇండియా త్వరలోనే ద్వైపాక్షిక సిరీస్ ఆడనుందని తెలిపింది. ఇరు దేశాల మధ్య చర్చలు తిరిగి ప్రారంభమైన వెంటనే సిరీస్ నిర్వహణకు సిద్ధంగా ఉండాలని పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు ఆ దేశ ప్రభుత్వ ఉన్నత వర్గాల నుంచి ఆదేశాలు వచ్చినట్లు పేర్కొంది. ఈ ఏడాది బిజీ షెడ్యూల్ కారణంగా ద్వైపాక్షిక సిరీస్ నిర్వహణ కష్టమని మరో అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.
ఇదీ చదవండి: 'పాక్‌లో టీమ్ ఇండియా ఆడుతుందని ఆశ'
ఈ ఏడాది భారత్‌కు పాక్..
భారత్‌తో ద్వైపాక్షిక సిరీస్ విషయాన్ని గతంలో ఖండించిన పాక్ బోర్డు.. ప్రస్తుతం అందుకు భిన్నంగా స్పందించింది. ఈ ఏడాది ఇరు దేశాల మధ్య క్రికెట్ తిరిగి ప్రారంభమయ్యే అవకాశం ఉందని తెలిపింది. కాగా పీసీబీ ఛైర్మన్ ఎహ్సాన్ మణి ఈ విషయంపై స్పందించారు. ఈ విషయమై తమను ఎవరూ సంప్రదించలేదని పేర్కొన్నారు. అదే కనుక జరిగితే ఈ సారి పాకిస్థాన్ టూర్‌కు భారత్ వెళ్లాల్సి ఉంటుంది. గతంలో దాయాది ఆటగాళ్లు ఇండియాలో పర్యటించారు.
ఈ ఏడాది టీ20 ప్రపంచకప్‌కు భారత్ ఆతిథ్యమివ్వనుంది. ఇది ఐసీసీ టోర్నమెంట్. దీంతో ఇందులో పాకిస్థాన్ కూడా పాల్గొంటుంది. అందులో భాగంగానే పాక్ క్రికెటర్లు.. ఇండియాకు రానున్నారు.
చివరగా 2012-13లో పరిమిత ఓవర్ల సిరీస్ కోసం భారత్‌లో పాక్ పర్యటించింది. 2008లో ఆసియా కప్ కోసం టీమ్‌ఇండియా.. పాక్‌కు వెళ్లింది. చివరగా ఈ రెండు జట్లు 2019 వన్డే ప్రపంచకప్‌లో తలపడ్డాయి.
ఇదీ చదవండి: జకోవిచ్‌ను లొంగదీసుకుంటే డబ్బులిస్తామన్నారు!