ETV Bharat / sports

'ఓటమి భయంతోనే టీమ్​ఇండియా అలా'

author img

By

Published : Jan 4, 2021, 7:04 AM IST

ఓడిపోతామనే భయంతోనే గబ్బా మైదానానికి భారత్​ రానంటోందని ఆసీస్ మాజీ క్రికెటర్ హాడిన్ చెప్పాడు. ఆస్ట్రేలియాలో ఏం జరుగుతుందో తెలుసుకునే​ ఇక్కడికి వచ్చిందని అన్నాడు.

India Don't Want To Go To Gabba As No One Wins There Against Australia: Brad Haddin
ఓటమి భయంతోనే భారత్​ అలా..

ఆస్ట్రేలియాతో గబ్బాలో జరిగే చివరి టెస్టులో ఓడిపోతామని తెలిసే టీమ్ఇండియా అక్కడ మ్యాచ్ ఆడేందుకు వెళ్లనంటోందని ఆ దేశ మాజీ క్రికెటర్ బ్రాడ్ హాడిన్ అన్నాడు. క్వారంటైన్​లో ఉండటం ఇష్టం లేదని చెప్పడం సరికాదని వ్యాఖ్యానించాడు.

"క్రికెట్ వైపు నుంచి చూస్తే.. భారత్ ఎందుకు గబ్బాకు వెళ్లాలనుకుంటుంది? అక్కడ ఆసీస్​పై ఏ జట్టూ గెలవదు. ఆ మైదానంలో కంగారూ ఆటగాళ్లు గొప్పగా ఆడతారు. కొతం కాలం నుంచి అక్కడ ప్రత్యర్థి గెలిచిన దాఖలాలు లేవు. ఆటగాళ్లు చాలా రోజుల నుంచి బబుల్​లో ఉన్న మాట నిజమే. దీంతో వాళ్లకు విసుగ్గా అనిపించొచ్చు. కానీ ఓ రాష్ట్రంలో వైరస్ లేనపుడు టెస్టు మ్యాచ్​ను అక్కడి నుంచి తరలించకూడదు. క్వారంటైన్​లో ఉండటం ఇష్టం లేదని చెప్పడం సరికాదు. ఈ ఆంక్షల గురించి వాళ్లకు ముందే తెలుసు. మొదట ఐపీఎల్, ఇప్పుడు ఆసీస్ పర్యటన కోసం వాళ్లు క్వారంటైన్​లో ఉన్నారు. ఆస్ట్రేలియా ఆటగాళ్లది కూడా అదే పరిస్థితి కదా. కానీ వాళ్లు అలా అనట్లేదు. భారత్​ గబ్బాలో ఆడకుండా ఉండేందుకు ప్రయత్నిస్తోంది." అని హాడిన్​ చెప్పాడు.

బ్రిస్బేన్​లో మరోసారి క్వారంటైన్​లో ఉండాల్సి వస్తే గబ్బాకు వచ్చేందుకు భారత్​ అభ్యంతరం వ్యక్తం చేసినట్లు వార్తలు వచ్చాయి. జనవరి 15 నుంచి 19 వరకు గబ్బాలో చివరిదైన నాలుగో టెస్టు జరగనుంది.

ఇదీ చూడండి: బ్రిస్బేన్​ టెస్టులో టీమ్​ఇండియా ఆడడం సందేహమే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.