ETV Bharat / sports

'ఆటగాళ్లకు ఆరు నుంచి ఎనిమిది వారాల శిక్షణ అవసరం'

కరోనా మహమ్మారి వల్ల ఆటగాళ్లందరూ ఇంటిపట్టునే ఉన్నారు. అందువల్ల వారికి ఎలాంటి శిక్షణ లేకుండా పోయింది. మళ్లీ అంతర్జాతీయ మ్యాచ్ ఆడాలంటే క్రికెటర్లకు ఆరు నుంచి ఎనిమిది వారాల శిక్షణ అవసరమని చెబుతున్నాడు టీమ్​ఇండియా బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్.

అరుణ్
అరుణ్
author img

By

Published : May 19, 2020, 8:30 PM IST

కరోనా వల్ల క్రీడాటోర్నీలన్నీ వాయిదా పడ్డాయి. ఈ కారణంగా ఆటగాళ్లందరూ ఇంటికే పరిమితమయ్యారు. టీమ్​ఇండియా క్రికెటర్లు కూడా ఇంటివద్దే ఉంటూ సోషల్ మీడియాలో అభిమానులతో టచ్​లో ఉంటున్నారు. ఈ విరామ సమయంలో ఆటగాళ్లకు శిక్షణ మాత్రం కరవైంది. మళ్లీ బరిలోకి దిగాలంటే కచ్చితంగా ప్రాక్టీస్ చేయాల్సిందే. ఇదే విషయమై తాజాగా స్పందించాడు భారత జట్టు బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్.

"ఒక ప్రొఫెషనల్ క్రీడాకారుడిగా ఇంట్లో ఖాళీగా కూర్చోవడం బోరింగ్​గా ఉంటుంది. అయితే మళ్లీ అంతర్జాతీయ మ్యాచ్ ఆడాలంటే ఆటగాళ్లకు కనీసం ఆరు నుంచి ఎనిమిది వారాల ప్రాక్టీస్ అవసరం. మేనేజ్​మెంట్​ కూడా అదే ఆలోచిస్తోంది. ఆటగాళ్లందరికీ నైపుణ్యవంతమైన శిక్షణను అందిస్తాం"

-భరత్ అరుణ్, టీమ్​ఇండియా బౌలింగ్ కోచ్

ప్రస్తుతం దేశంలో నాలుగో దశ లాక్​డౌన్ కొనసాగుతోంది. ఇందులో కేంద్ర ప్రభుత్వం క్రీడా కార్యకలాపాల నిర్వహణకు అనుమతిచ్చింది. దీనిపై బీసీసీఐ సమాలోచనలు చేస్తోంది. ఆటగాళ్ల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని త్వరలోనే ఓ నిర్ణయం తీసుకుంటామని తెలిపింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.