టీమిండియా కోచ్‌గా ఎవరు వస్తారనే దానిపై ప్రస్తుతం చర్చ నడుస్తోంది. ఇప్పటికే దరఖాస్తులు ఆహ్వానించింది బీసీసీఐ. కపిల్‌దేవ్‌తో నేతృత్వంలోని కమిటీ ఆరుగురికి మాత్రమే ఇంటర్వ్యూలు నిర్వహించనుంది. ఆగస్టు 16న ముంబయిలోని బీసీసీఐ ప్రధాన కార్యాలయంలో వీరికి మౌఖిక పరీక్ష జరగనుంది. అదే రోజు కోచ్ ఎవరనేది ప్రకటిస్తారని విశ్వసనీయ వర్గాల సమాచారం.
టీమిండియా కోచ్ రేసులో రవిశాస్త్రితోపాటు టామ్ మూడీ, మైక్ హెసన్, ఫిల్ సిమన్స్, రాబిన్‌సింగ్, లాల్‌చంద్ రాజ్‌పుత్‌లు ఉన్నారు. ముంబయిలో ఇంటర్వ్యూకు హాజరుకానివారు స్కైప్ ద్వారా పాల్గొనే వెసులుబాటు కల్పించారు. కెప్టెన్ విరాట్ కోహ్లీ.. రవిశాస్త్రి వైపే మొగ్గు చూపిన కారణంగా మళ్లీ అతడినే ఎంపిక చేస్తారని ప్రచారం జరుగుతోంది.
ప్రపంచకప్‌తోనే ప్రస్తుతం కోచ్ రవిశాస్త్రి, తదితర సిబ్బంది పదవుల కాంట్రాక్టులు ముగిసినప్పటికీ విండీస్ పర్యటన నేపథ్యంలో 45 రోజులు పొడింగించారు.
ఇది చదవండి: కరీబియన్ దీవుల్లో భారత క్రికెటర్ల జలకాలాట