భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరిగే తొలి టీ20 కోసం ఇరుజట్లు హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాలకు చేరుకున్నాయి. టీమిండియాకు శుక్రవారం ఘన స్వాగతం లభించింది.
సెప్టెంబర్ 9న ధర్మశాల వచ్చిన సఫారీ ఆటగాళ్లకు కాస్త విరామం దొరకడం వల్ల మెక్లోడ్గంజ్ ప్రాంతంలో షాపింగ్ చేశారు. కొందరు హెయిర్‌కట్ కూడా చేయించుకున్నారు. స్థానికంగా దొరికే వస్తువులు కొనుగోలు చేశారు. టిబెటియన్ డంప్లింగ్స్ వంటి సంప్రదాయ ఆహారపదార్థాలను రుచిచూశారు. దక్షిణాఫ్రికా సారథి క్వింటన్ డికాక్ సహా కొంత మంది ప్లేయర్లు హొటల్లోనే గడిపారు.
ఐపీఎల్లో దిల్లీ జట్టు తరఫున బరిలోకి దిగిన రబాడ.. టోర్నీ ఆఖరులో ప్రపంచకప్ కోసం స్వదేశానికి వెళ్లిపోయాడు. ఆ తర్వాత మళ్లీ ఈ టోర్నీ కోసం ఇప్పుడు భారత్‌కు వచ్చాడు. ఈ సందర్భంగా ట్విట్టర్ వేదికగా తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు.
" ఇండియాలో మళ్లీ అడుగుపెట్టి క్రికెట్ ఆడటం చాలా ఆనందంగా ఉంది".
రబాడ, దక్షిణాఫ్రికా బౌలర్
భారత జట్టు:
విరాట్ కోహ్లీ (కెప్టెన్), రోహిత్ శర్మ (వైస్ కెప్టెన్), ధావన్, కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్, మనీష్ పాండే, రిషబ్ పంత్ (కీపర్), హార్దిక్ పాండ్య, రవీంద్ర జడేజా, కృణాల్ పాండ్య, వాషింగ్టన్ సుందర్, రాహుల్ చాహర్, ఖలీల్ అహ్మద్, దీపక్ చాహర్, నవదీప్ సైనీ.
దక్షిణాఫ్రికా జట్టు:
క్వింటన్ డికాక్ (సారథి), డసెన్ (ఉప సారథి), తంబే బువమా, జూనియర్ డలా, ఫార్చ్యూన్, బ్యూరెన్ హెండ్రిక్స్, రీజా హెండ్రిక్స్, డేవిడ్ మిల్లర్, ఆన్రిచ్ నోర్టజే, ఫెలుక్వాయో, ప్రిటోరియస్, రబాడ, తబ్రేజ్ షంశీ, జార్డ్ లిండే.
ఫొట్టి ఫార్మాట్ మ్యాచ్‌లు ముగిశాక ప్రోటీస్ జట్టుతోనే మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆరంభం కానుంది. మొదటి టెస్టు విశాఖలో (అక్టోబర్ 2-6), రెండోది పుణె (అక్టోబర్ 10-14), మూడోది రాంచీ (అక్టోబర్ 19-23)లో నిర్వహించనున్నారు. ఈ సిరీస్‌తోనే సఫారీ జట్టు తన ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ను ఆరంభించనుంది.
ఇదీ చదవండి...