ETV Bharat / sports

భారత్-న్యూజిలాండ్: సరిచేస్తారా.. సమర్పిస్తారా? - virat kohli

తాడోపేడో తేల్చుకునేందుకు టీమిండియా సిద్ధమైంది. న్యూజిలాండ్ రెండో వన్డే నేడు ఆక్లాండ్ వేదికగా జరగనుంది. ఇందులో గెలిస్తే సిరీస్​ సమమవుతుంది. లేదంటే ప్రత్యర్థి వశమవుతుంది.

భారత్-న్యూజిలాండ్: సరిచేస్తారా.. సమర్పిస్తారా?
భారత క్రికెట్ జట్టు
author img

By

Published : Feb 8, 2020, 5:28 AM IST

Updated : Feb 29, 2020, 2:33 PM IST

న్యూజిలాండ్‌తో మరో కీలక సమరానికి టీమిండియా సిద్ధమైంది. నేడు(శనివారం) కివీస్‌తో రెండో వన్డేలో కోహ్లీ సేన తలపడనుంది. మూడు వన్డేల సిరీస్‌లో తొలి మ్యాచ్‌ ఓడిన భారత్‌.... ఈ మ్యాచ్‌లో గెలవాలన్న పట్టుదలతో ఉంది. ఉదయం 7:30 గంటలకు ప్రారంభం కానుందీ మ్యాచ్.
తొలి వన్డేలో జరిగిన బౌలింగ్‌, ఫీల్డింగ్‌ వైఫల్యాలు పునరావృతం కాకుండా చూడాలని భారత్‌ భావిస్తోంది. తొలి వన్డేలో భారత్‌ను చిత్తు చేసిన కివీస్‌.. అదే జోరు కొనసాగించాలన్న లక్ష్యంతో బరిలో దిగుతోంది.

బ్యాటింగ్ అదరగొట్టాలి!

ఈ మ్యాచ్​లోని బ్యాటింగ్‌లో భారత్‌కు పెద్దగా సమస్యలు ఎదురయ్యే అవకాశం లేదు. తొలి వన్డేలో పర్వాలేదనించిన పృధ్వీ షా- మయాంక్ అగర్వాల్‌ ఈరోజూ బ్యాటింగ్‌ దాడిని ఆరంభించనున్నారు. కోహ్లీ, రాహుల్‌ సూపర్‌ ఫామ్‌లో ఉండడం భారత్​కు కలిసొచ్చే అంశం. గత మ్యాచ్‌లో, తన వన్డే కెరీర్​లో తొలి సెంచరీ సాధించిన శ్రేయస్ అయ్యర్‌ కూడా ఫామ్‌ను కొనసాగించాలని చూస్తున్నాడు.

rahul manish mayank
కేఎల్ రాహుల్-మనీశ్ పాండే-మయాంక్ అగర్వాల్

కలవరపెడుతున్న ఫీల్డింగ్

కోహ్లీ సేనను బౌలింగ్‌, ఫీల్డింగ్‌ వైఫల్యాలు ఆందోళన రేపుతున్నాయి. మధ్య ఓవర్లలో వికెట్లు తీయలేకపోవడం.. భారత్‌కు ప్రతికూల అంశంగా మారుతోంది. తొలి వన్డేలో టీమిండియా.. 24 వైడ్లు సహా మొత్తం 29 అదనపు పరుగులు ఇవ్వడం టీమ్‌ మేనేజ్‌మెంట్‌ను కలవరపరుస్తోంది.

శార్దుల్ బదులు ఠాకుర్?

ఈ మ్యాచ్​లో భారత జట్టులో మార్పులు చేసే అవకాశముంది. శార్దూల్‌ ఠాకూర్ స్థానంలో నవదీప్‌ సైనీ తుది జట్టులోకి రావొచ్చు. కేదార్‌ జాదవ్‌కు బదులుగా మనీశ్ పాండేను తీసుకొనే అవకాశాలను మేనేజ్‌మెంట్‌ పరిశీలిస్తోంది.

team india
భారత జట్టు

తొలి వన్డేలో అత్యధిక పరుగులను ఛేదించి చరిత్ర సృష్టించిన కివీస్‌.... రెండో వన్డేలోకి పూర్తి ఆత్మ విశ్వాసంతో బరిలోకి దిగుతోంది. ఈరోజు గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని పట్టుదలగా ఉంది. తొలి మ్యాచ్‌కు దూరమైన కెప్టెన్‌ విలియమ్సన్‌ ఈ మ్యాచ్‌లో ఆడడం కూడా సందేహంగా ఉంది. బౌలింగ్‌ వైఫల్యం కివీస్‌ను కూడా కలవరపెడుతోంది. ఈ మ్యాచ్‌లో వాటిని అధిగమించాలని న్యూజిలాండ్‌ భావిస్తోంది.

ross taylor
రాస్ టేలర్

టాస్ కీలకం

ఈ వన్డేలో టాస్‌ కీలకపాత్ర పోషించనుంది. ఈడెన్‌ పార్క్‌లో రెండోసారి బ్యాటింగ్‌ చేయడం ప్రయోజనకరంగా ఉండనుంది. తేమ కారణంగా బౌలర్లకు బాల్‌పై పట్టు దొరకడం కష్టంగా మారనుంది. తొలి వన్డేలో ఈ సమస్య వల్లే భారత్‌ భారీగా అదనపు పరుగులు ఇచ్చింది.

ZCZC
PRI ESPL NAT
.NEWDELHI DES28
AVI-UDAN-BIDAR
Udan scheme: TruJet stats daily flight on Bidar-Bengaluru route
         New Delhi, Feb 7 (PTI) TruJet started daily flight operations on Friday between the hill top city of Karnataka and Bengaluru under the government's regional connectivity Udan scheme, according to a statement.
         The Bidar airport has been remodelled under the Centre's Udan scheme and developed at an estimated cost of Rs 11 crore, the statement by the Ministry of Civil Aviation said.
         Bengaluru-Bidar route, where TruJet would be conducting a daily flight, is 252nd route to be operationalised under the Udan scheme, under which financial incentives in terms of concessions from the Centre, state governments and airport operators are extended to selected airlines to encourage operations from unserved and undeserved airports. PTI DSP
KJ
KJ
02071837
NNNN
Last Updated : Feb 29, 2020, 2:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.