కెరీర్లోనే తొలిసారిగా వరుస వైఫల్యాలతో సతమతమవుతున్న భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ.. తిరిగి గాడిలో పడ్డాడు. అయితే ఫామ్‌ను తిరిగి అందుకోవడంపై స్పందించాడు కోహ్లీ. ఈ విషయంలో తన భార్య అనుష్క శర్మ, ఐపీఎల్ జట్టు సభ్యుడు ఏబీ డివిలియర్స్ తనకు సలహాలు ఇచ్చారని పేర్కొన్నాడు.
క్రికెట్లోని ప్రాథమిక అంశాలపై దృష్టి పెట్టాను. టీమ్ఇండియాకు ఆడటంపై ఎల్లప్పుడూ గర్వపడతాను. బంతిపై దృష్టి సారించాలని నా భార్య నాకు చెప్పింది. ఆటకు ముందు ఐపీఎల్ సహచరుడు డివిలియర్స్‌తో ప్రత్యేకంగా చాట్ చేశాను. అతడు కూడా బంతిని సరిగా అంచనా వేయాలని సూచించాడు. సరిగ్గా అదే పని చేశాను. సత్ఫలితం పొందాను.
-విరాట్ కోహ్లీ, భారత కెప్టెన్.
అహ్మదాబాద్ వేదికగా ఆదివారం ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో టీ20లో 49 బంతుల్లోనే 73* పరుగులు చేసిన కోహ్లీ.. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. తాజా హాఫ్ సెంచరీతో కలిపి పొట్టి ఫార్మాట్లో అతడి అర్థ శతకాల సంఖ్య 26కి చేరింది.
ఇదీ చదవండి: 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ఆయనకు అంకితం'