భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ వన్డేల్లో.. మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో వన్డేలో అర్ధసెంచరీతో రాణించిన కోహ్లీ.. మూడో స్థానంలో పది వేల పరుగులు పూర్తి చేసిన జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు. 190 ఇన్నింగ్స్‌ల్లో విరాట్ ఈ మైలురాయిని చేరుకున్నాడు.
ఇదీ చదవండి: సచిన్ సరసన విరాట్.. సొంతగడ్డపై 10వేల రన్స్
ఇదీ చదవండి: 'కింగ్' కోహ్లీ ఖాతాలో మరిన్ని రికార్డులు
మొదటి స్థానంలో ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ ఉన్నాడు. 330 ఇన్నింగ్స్‌ల్లో 12,662 పరుగులతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు పాంటింగ్. శ్రీలంక బ్యాట్స్‌మెన్ కుమార సంగక్కర 238 ఇన్నింగ్స్‌ల్లో 9,747 పరుగులతో విరాట్ తర్వాతి స్థానంలో ఉన్నాడు. దక్షిణాఫ్రికా మాజీ ఆల్‌రౌండర్ జాక్వెస్ కలిస్ 7,774 పరుగులతో నాలుగో స్థానంలో నిలిచాడు.
వరుసగా 4 అర్ధసెంచరీలు..
ఈ మ్యాచ్‌లో 66 పరుగులతో ఆకట్టుకున్న కోహ్లీ.. గత నాలుగు వన్డే ఇన్నింగ్స్‌ల్లోనూ (89, 63, 56, 50*) హాఫ్ సెంచరీలు చేశాడు. ఇలా వరుస ఇన్నింగ్స్‌ల్లో నాలుగు అంతకంటే ఎక్కువ సార్లు అర్ధ సెంచరీలు చేయడం విరాట్‌కు ఇది ఏడో సారి.
ఇదీ చదవండి: బంతికి ఉమ్మి రుద్దిన స్టోక్స్.. హెచ్చరించిన అంపైర్లు