భారత యువ బౌలర్ టి.నటరాజన్ ఇంగ్లాండ్‌తో టీ20 సిరీస్‌కు దూరమయ్యే అవకాశం కనిపిస్తోంది. మోకాలి, భుజం గాయాల కారణంగా అతడు సిరీస్‌లో ఆడేది అనుమానంగా మారింది. గత ఆస్ట్రేలియా సిరీస్‌లో అత్యుత్తమ ప్రదర్శన చేశాడు నట్టూ.
"నటరాజన్ మోకాలి, భుజం గాయంతో బాధపడుతున్నాడు. అతడు ఇంగ్లాండ్‌తో టీ20 సిరీస్‌లో ఆడేది అనుమానంగా మారింది." అని జాతీయ క్రికెట్ అకాడమీ వర్గాలు వెల్లడించాయి.
మరో క్రికెటర్ వరుణ్ చక్రవర్తి కూడా ఈ సిరీస్‌లో ఆడేది స్పష్టత లేదు. తప్పనిసరి ఫిట్నెస్ పరీక్షను వరుణ్ అధిగమించలేకపోయాడు. దీంతో అతని స్థానంలో రాహుల్ చాహర్‌ను ఆడించే అవకాశం ఉంది. హార్దిక్ పాండ్య సైతం టీ20లకు పూర్తి స్థాయిలో సన్నద్ధమని ప్రకటించాడు. అతడు బ్యాటింగ్, బౌలింగ్ చేస్తున్న వీడియోను ట్విట్టర్లో పోస్టు చేశాడు.
ఇదీ చదవండి: ఇంగ్లాండ్‌తో టీ20 సిరీస్ ఆడేందుకు సిద్ధం: హార్దిక్