టీమ్ఇండియాతో జరుగుతున్న మూడో టెస్టులో అంపైరింగ్పై మ్యాచ్ రిఫరీ శ్రీనాథ్‌ను ఇంగ్లాండ్ జట్టు ఆశ్రయించింది. తొలి రోజు (బుధవారం) మ్యాచ్ ముగిసిన తర్వాత ఆయనను కలిసి అంపైర్ నిర్ణయాలపై మర్యాదపూర్వకంగా కెప్టెన్ జో రూట్, ప్రధాన కోచ్ ఆరాతీశారు. దీనిని ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు ధ్రువీకరించింది.
"అంపైర్లు ఎదుర్కొన్న సవాళ్లను కెప్టెన్, ప్రధాన కోచ్ అంగీకరించారు. అయితే నిర్ణయాలు తీసుకునే ప్రక్రియలో సరిగా వ్యవహరించారా? లేదా? అని రిఫరీని మర్యాదపూర్వకంగా అడిగారు. రిఫరీ కూడా అంపైర్ల గురించి వారు సరైన ప్రశ్నలు లేవనెత్తినట్లు చెప్పారు."
-ఇంగ్లాండ్, వేల్స్ క్రికెట్ బోర్డు
గులాబి టెస్టు తొలి రోజున థర్డ్ అంపైర్ షంషుద్దీన్ నిర్ణయాలపై పర్యాటక జట్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. భారత ఓపెనర్లు శుభ్‌మన్ గిల్, రోహిత్ శర్శలను ఆన్‌ఫీల్డ్ అంపైర్లు ఔట్‌గా ప్రకటించగా.. అప్పీలుపై వారిని నాటౌట్‌గా తేల్చారు టీవీ అంపైర్.
రెండో ఓవర్లో గిల్ క్యాచ్‌పై బెన్ స్టోక్స్ అప్పీల్ చేశాడు. దానిని పరిశీలించిన మీదట థర్డ్ అంపైర్ నాటౌట్‌గా ప్రకటించాడు. కానీ కొన్ని కోణాల్లో అది ఔట్‌గా అనిపించినట్లు ఇంగ్లాండ్ జట్టు అసహనం వ్యక్తం చేసింది. రోహిత్ స్టంపింగ్ విషయంలో కూడా ఇదే జరిగిందని వారు వాపోయారు . దీంతో ఆన్‌ఫీల్డ్ అంపైర్ నితిన్ మేనన్‌తో 'మాకు స్థిరత్వం కావాలి' అని రూట్ అన్నాడు.
అంతకుముందు ఇంగ్లాండ్ ఓపెనర్ క్రాలే కూడా అంపైర్ల నిర్ణయంపై అసహనం వ్యక్తంచేశాడు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 99/3 పరుగుల వద్ద నిలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 112 పరుగులకే కుప్పకూలింది.
ఇదీ చూడండి: బంతికి ఉమ్ము రుద్దిన స్టోక్స్- శానిటైజ్ చేసిన అంపైర్లు