ETV Bharat / sports

'రెండో టెస్టు మూడు రోజుల్లోనే ముగుస్తుంది!' - హర్భజన్​ ట్వీట్​

ఇంగ్లాండ్​తో జరుగుతున్న రెండో టెస్ట్​ మ్యాచ్​ మూడు లేదా మూడున్నర రోజుల్లోనే ముగుస్తుందని భావిస్తున్నట్టు చెప్పాడు భారత మాజీ స్పిన్నర్​ హర్భజన్​ సింగ్​. చెపాక్​ పిచ్​ తొలి రోజు నుంచే స్పిన్నర్లకు సహకరించడమే ఇందుకు కారణమన్నాడు.

Match will get over in 3 to 3.5 days, reckons Harbhajan
హర్భజన్​ సింగ్
author img

By

Published : Feb 13, 2021, 7:51 PM IST

Updated : Feb 13, 2021, 7:57 PM IST

చెన్నై వేదికగా ఇంగ్లాండ్​తో జరుగుతున్న రెండో టెస్ట్​ మ్యాచ్​.. మూడు లేదా మూడున్నర రోజుల్లో ముగుస్తుందని అభిప్రాయపడ్డాడు టీమ్​ఇండియా మాజీ స్పిన్నర్​ హర్భజన్​ సింగ్. చెపాక్​ పిచ్​పై తొలి సెషన్​లోనే ఎనిమిదో రోజు మ్యాచ్​లాగా బంతి గింగిరాలు తిరుగుతోందని ట్విట్టర్​లో పేర్కొన్నాడు భజ్జీ.

Harbhajan Singh Tweet
హర్భజన్​ ట్వీట్​

"రెండో టెస్ట్​​ మొదటి సెషన్​లోనే.. 8వ రోజు లాగా బంతి స్పిన్​ అవుతోంది. ఈ మ్యాచ్​ నా ఊహ ప్రకారం.. మూడు, మూడున్నర రోజుల్లో ముగుస్తుంది."

- హర్భజన్​ సింగ్​, టీమ్​ఇండియా మాజీ ఆఫ్​ స్పిన్నర్​

రెండో టెస్ట్​లో టాస్​ గెలిచిన భారత్​ బ్యాటింగ్​ ఎంచుకోగా.. విజయావకాశాలు కూడా ఆతిథ్య జట్టుకే ఎక్కువగా ఉంటాయని అభిప్రాయపడ్డాడు ఇంగ్లండ్​ మాజీ కెప్టెన్​ మైకేల్​ వాన్​. ఒకవేళ మ్యాచ్​ ఇంగ్లండ్​ గెలిస్తే అది అద్భుతమేనని ట్వీట్​ చేశాడు.

Vaughan Tweet
మైకెల్​ వాన్​ ట్వీట్​

"ఈ పిచ్​పై టాస్​ ఓడిన ఇంగ్లండ్​.. మ్యాచ్​ గెలిస్తే అదో గొప్ప విజయం అవుతుంది."

- మైకేల్​ వాన్​, ఇంగ్లండ్ మాజీ కెప్టెన్​

సిరీస్​లో తొలి టెస్ట్​ స్పిన్నర్లకు అంతగా అనుకూలించకపోగా.. అదే స్టేడియంలో జరుగుతోన్న రెండో టెస్ట్​ వికెట్​ మాత్రం అందుకు భిన్నంగా స్పందిస్తోంది. తొలి రోజు నుంచే బంతి తిరుగుతూ స్పిన్నర్లకు స్వర్గధామంలా మారింది.

ఈ మ్యాచ్​లో టీమ్​ఇండియా తొలి రోజు ఆట ముగిసే సమయానికి 6 వికెట్ల నష్టానికి 300 పరుగులు చేసింది. రోహిత్ శర్మ (161) భారీ శతకంతో ఆకట్టుకోగా.. రహానె అర్ధసెంచరీ(67) ఫర్వాలేదనిపించాడు. క్రీజులో రిషభ్​ పంత్​( 33), అక్షర్​ పటేల్​(5) ఉన్నారు. ప్రత్యర్థి జట్టు బౌలర్లలో మొయిన్​ అలీ, జాక్​ లీచ్​ రెండేసి వికెట్లు సాధించగా.. ఓలీ స్టోన్​, కెప్టెన్​ రూట్​లకు ఒక్కో వికెట్​ దక్కింది.

ఇదీ చదవండి: 'చెపాక్​ పిచ్​పై 300 కొట్టినా 500 చేసినట్లే'

Last Updated : Feb 13, 2021, 7:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.