ETV Bharat / sports

భారత్​తో తొలి టెస్టుకు వార్నర్​ దూరం - వార్నర్​ గాయం అప్​డేట్స్​

గాయంతో బాధపడుతోన్న ఆసీస్​ ఆటగాడు వార్నర్​.. టీమ్​ఇండియాతో జరిగే తొలి టెస్టుకు అందుబాటులో ఉండటం లేదు. ఈ మేరకు ఆస్ట్రేలియా క్రికెట్​ బోర్డు ప్రకటన చేసింది. రెండో వన్డేలో తొడకండరానికి గాయమవ్వడం వల్ల ఇప్పటికే మూడో వన్డే, టీ20సిరీస్​కు దూరమయ్యాడు ఈ స్టార్​ బ్యాట్స్​మన్​.

Warner
వార్నర్​ దూరం
author img

By

Published : Dec 9, 2020, 8:44 AM IST

ఆస్ట్రేలియా జట్టుకు నిరాశపరిచే వార్త. టీమ్​ఇండియాతో జరిగిన రెండో వన్డేలో గాయపడిన ఆసీస్​ స్టార్​ బ్యాట్స్​మన్​ డేవిడ్​ వార్నర్​ ఇంకా కోలుకోలేదు. దీంతో అడిలైడ్​ వేదికగా జరిగే తొలి టెస్టుకు కూడా అతడు దూరం కానున్నాడు. ఈ విషయాన్ని ఆసీస్​ క్రికెట్ బోర్డు స్పష్టం చేసింది.

"​గాయం నుంచి క్రమక్రమంగా కోలుకుంటున్నాను. ప్రస్తుతం బాగానే ఉన్నాను. కానీ 100శాతం ఫిట్​నెస్​ సాధించినట్లు నాకు, నా సహ ఆటగాళ్లకు అనిపిస్తేనే టెస్టు మ్యాచులకు సిద్ధంగా ఉంటాను" అని వార్నర్​ అన్నాడు. రెండో టెస్టు నాటికి వార్నర్ పూర్తిగా కోలుకుని మిగతా మ్యాచులకు అందుబాటులో ఉంటాడని ఆశాభావం వ్యక్తం చేశాడు ఆసీస్​ హెడ్​ కోచ్​ జస్టిన్​ లాంగర్​.

నాలుగు మ్యాచులతో కూడిన టెస్టు సిరీస్​ డిసెంబర్​ 17నుంచి ​ప్రారంభం కానుంది. కాగా, ఇప్పటికే వన్డే సిరీస్​ను ఆసీస్​, టీ20సిరీస్​ను టీమ్​ఇండియా కైవసం చేసుకున్నాయి.

ఇదీ చూడండి : భారత్​తో మిగతా మ్యాచ్​లకు వార్నర్​​ దూరం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.