ETV Bharat / sports

భారత్​ X ఆస్ట్రేలియా: హాట్​​ కేకుల్లా అమ్ముడైన టికెట్లు - భారత్​ X ఆస్ట్రేలియా వార్తలు

భారత్​ - ఆస్ట్రేలియా మధ్య జరగనున్న పరిమిత ఓవర్ల సిరీస్​ టికెట్లన్నీ దాదాపుగా అయిపోయాయని ఆసీస్ బోర్డు చెప్పింది. నవంబరు 27న తొలి వన్డే సిడ్నీ వేదికగా జరగనుంది.

Ind vs Aus: Three T20Is, two ODIs sold out on first day of booking
భారత్​ X ఆస్ట్రేలియా: హాట్​​ కేకుల్లా అమ్ముడైన టికెట్లు
author img

By

Published : Nov 20, 2020, 2:22 PM IST

భారత్​, ఆస్ట్రేలియా మధ్య జరగనున్న మూడు టీ20లు, రెండు వన్డేల టికెట్లు.. శుక్రవారం అమ్మకానికి పెట్టిన గంటల్లోనే అయిపోయాయని క్రికెట్​ ఆస్ట్రేలియా తెలిపింది. నవంబరు 27న సిడ్నీలో జరగనున్న తొలి వన్డే కోసం మరో 1900 టికెట్లు మాత్రమే మిగిలున్నాయని పేర్కొంది. సిడ్నీ, ఓవల్​లో జరిగే వన్డే, టీ20 సిరీస్​ల కోసం 50 శాతం సామర్థ్యంతో ప్రేక్షకులను అనుమతించారు.

నవంబర్‌ 27న ప్రారంభమై జనవరి 19న ముగిసే ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా భారత్‌.. మూడు వన్డేలు, మూడు టీ20లు, నాలుగు టెస్టులు ఆడనుంది. డిసెంబర్‌ 17న అడిలైడ్‌ వేదికగా తొలి డే/నైట్‌ టెస్టు జరగనుంది.

అయితే, సిడ్నీలో కరోనా తీవ్రత లేకపోవడం వల్ల పరిమిత ఓవర్ల మ్యాచ్‌లకు ఎలాంటి ఇబ్బందులు లేవు. తొలి రెండు వన్డేలు, ఆఖరి రెండు టీ20లు సిడ్నీ వేదికగా, రెండో వన్డే, మొదటి టీ20 కాన్‌బెర్రాలో జరగనున్నాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.