ETV Bharat / sports

కోహ్లీ కెప్టెన్ ఇన్నింగ్స్.. భారత్ 233/6 - బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2020

ఆస్టేలియాతో జరుగుతోన్న పింక్ బాల్ టెస్టులో తొలిరోజు ఆటముగిసే సమయానికి టీమ్ఇండియా 6 వికెట్ల నష్టానికి 233 పరుగులు చేసింది. కోహ్లీ 74 పరుగులతో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు.

IND vs AUS Test
కోహ్లీ కెప్టెన్ ఇన్నింగ్స్.. భారత్ 233/6
author img

By

Published : Dec 17, 2020, 5:07 PM IST

Updated : Dec 17, 2020, 5:14 PM IST

ఆస్ట్రేలియాతో జరుగుతోన్న పింక్ బాల్ టెస్టులో తొలిరోజు ఆట ముగిసింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్​కు దిగిన టీమ్ఇండియాకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఇన్నింగ్స్ రెండో బంతికే యువ ఓపెనర్ పృథ్వీ షా పెవిలియన్ చేరాడు. తర్వాత పుజారాతో కలిసి ఇన్నింగ్స్​ను చక్కదిద్దాడు మయాంక్ అగర్వాల్. వీరిద్దరూ రెండో వికెట్​కు 31 పరుగులు చేశారు. భాగస్వామ్యం కుదురుకుంటున్న క్రమంలో మయాంక్​ (17)ను ఔట్ చేశాడు కమిన్స్. అనంతరం పుజారా 43 పరుగులు చేసి పెవిలియన్​ చేరాడు.

match total
కమిన్స్ ఆనందం

అనంతరం విరాట్ కోహ్లీ (74) కెప్టెన్ ఇన్నింగ్స్​ ఆడాడు. రహానేతో కలిసి నాలుగో వికెట్​కు 88 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. కానీ దురదృష్టవశాత్తు రనౌట్​గా వెనుదిరిగాడు. తర్వాత కాసేపటికే రహానే (42) స్టార్క్ బౌలింగ్​లో ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ చేరాడు. విహారి (16) నిరాశపరిచాడు. మొత్తంగా మొదటి రోజు ఆటముగిసే సమయానికి టీమ్ఇండియా 6 వికెట్ల నష్టానికి 233 పరుగులు చేసింది. సాహా (9), అశ్విన్ (15) క్రీజులో ఉన్నారు.

ఆస్ట్రేలియా బౌలర్లలో స్టార్క్ 2, హెజిల్​వుడ్, కమిన్స్, లియోన్ చెరో వికెట్ దక్కించుకున్నారు.

Last Updated : Dec 17, 2020, 5:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.