టీమ్ఇండియాతో జరుగుతోన్న రెండో టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా లంచ్ విరామ సమయానికి 65/3 వద్ద ఉంది. ఆసీస్ జట్టుకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. బుమ్రా బౌలింగ్‌లో జో బర్న్(0) ఒక్క పరుగు కూడా చేయకుండానే పంత్ చేతికి చిక్కాడు. మ్యాథ్యూ వేడ్(30) క్రీజులోకి నిలదొక్కుకోవడానికి ప్రయత్నించినా అశ్విన్ బౌలింగ్‌లో జడేజా చేతికి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.
ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన లబుషేన్ ఆచితూచి ఆడుతోన్నాడు. అయితే స్టార్ బ్యాట్స్‌మన్ స్టీవ్ స్మిత్(0) కూడా అశ్విన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. ప్రస్తుతం లబునేష్(26) ట్రావెన్ హెడ్(4) క్రీజులో ఉన్నారు. అశ్విన్‌కు 2 వికెట్లు దక్కగా, బుమ్రా ఓ వికెట్ పడగొట్టాడు.