ETV Bharat / sports

ఆసీస్​పై గెలిచి మరోసారి చరిత్ర సృష్టిస్తాం: షమి

ఆసీస్​ గడ్డపై టెస్టు సిరీస్​లో మరోసారి గెలిచి చరిత్ర సృష్టిస్తామని టీమ్​ఇండియా పేసర్​​ షమి ధీమా వ్యక్తం చేశాడు. ఎంతటి ప్రపంచస్థాయి బ్యాట్స్​మన్​ అయినా తమ బౌలింగ్​లో ఔట్​ అవ్వాల్సిందేనని అన్నాడు. డిసెంబరు 17 నుంచి తొలి టెస్టు ప్రారంభం కానుంది.

ind vs aus: Mohammed Shami confident India's fast bowlers can repeat 2018/19 heroics
'ఆసీస్​పై మరోసారి గెలిచి చరిత్రను తిరగరాస్తాం'
author img

By

Published : Nov 22, 2020, 12:18 PM IST

వచ్చే నెలలో ఆస్ట్రేలియాతో జరగబోయే టెస్టు సిరీస్​లో వార్నర్​, స్మిత్​ ఆడటం భారత్​కు సవాలేనని చెప్పాడు భారత బౌలర్ షమి. అయితే గత పర్యటనలానే ఈసారి కూడా తన సహచర పేసర్లు, బ్యాట్స్​మెన్​ అద్భుతమైన ప్రదర్శన చేస్తారని ధీమా వ్యక్తం చేశాడు.

2018లో జరిగిన బోర్డర్​-గావస్కర్​ ట్రోఫీలో ఆస్ట్రేలియాపై భారత్​ 2-1తేడాతో ఘనవిజయం సాధించింది. ఆ గెలుపు వెనుక టీమ్​ఇండియా బౌలర్ల కృషి ఉంది. ఆడిన ఎనిమిది ఇన్నింగ్స్​లలో ప్రత్యర్థి జట్టును ఏడుసార్లు ఆలౌట్​ చేశారు. జస్​ప్రీత్​ బుమ్రా (21) ఎక్కువ వికెట్లు పడగొట్టగా, మహ్మద్​ షమి (16), ఇషాంత్​ శర్మ (11) కూడా తమవంతు పాత్ర పోషించారు.

"మా బౌలర్లలో 140 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్​ చేయగలిగిన వారు ఉన్నారు. ఆస్ట్రేలియా బ్యాట్స్​మెన్​ ఎదుర్కొవాలంటే అలాంటి పేసర్లు అవసరం. స్పిన్​ బౌలింగ్​లోనూ రకరకాల వైవిధ్యాలు కలిగిన వాళ్లు ఉన్నారు. మా​ నైపుణ్యాలూ భిన్నంగా ఉన్నాయి. అత్యుత్తమ బ్యాట్స్​మెన్​ కూడా మా జట్టులో ఉన్నారు. ఇరుజట్ల మధ్య మంచి పోటీ ఉంటుంది. గత పర్యటనలోని ప్రతి టెస్టులోనూ దాదాపుగా ప్రత్యర్థిని ఆలౌట్​ చేశాం. ఫ్రీడమ్​ ట్రోఫీ లేదా పింక్​-బాల్​ టెస్టులోనూ చాలా ప్రభావంతంగా బౌలింగ్ చేశాం. ఆస్ట్రేలియాతో త్వరలో జరగబోయే టెస్టు సిరీస్​లోనూ దీనిని పునరావృతం చేయాలని చూస్తున్నాం"

- మహ్మద్​ షమి, టీమ్​ఇండియా పేసర్​

ఐపీఎల్‌లో సంతృప్తికర ప్రదర్శన వల్ల ఆస్ట్రేలియా పర్యటనపై ఒత్తిడి తొలగిపోయిందని పేర్కొన్నాడు షమి. కంగారూల సొంతగడ్డపై వారినే ఢీకొట్టగల ఆటగాళ్లు భారత్‌లో ఉన్నారని స్పష్టం చేశాడు. పంజాబ్‌ తరఫున ఆడిన షమి.. ఈసారి ఐపీఎల్​ 20 వికెట్లు తీశాడు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.