ETV Bharat / sports

టీమ్ఇండియా గెలుపు.. ఎందరికో మేలుకొలుపు ! - IND vs AUS Gabba Test

ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్​ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది టీమ్ఇండియా. ఎన్నో అవమానాలు, అనుమానాల మధ్య సిరీస్ గెలిచి అందరి నోళ్లు మూయించింది. ఎవరేమన్నా ఈ సిరీస్ మాత్రం క్రికెట్ అభిమానులకు ఓ మధురానుభూతి అనడంలో సందేహం లేదు.

IND vs AUS
టీమ్ఇండియా
author img

By

Published : Jan 19, 2021, 4:24 PM IST

డిసెంబర్ 19, 2020.. ఆస్ట్రేలియా పర్యటనలో తొలి టెస్టు ఆడిన టీమ్ఇండియా ఘోరపరాభవాన్ని చవిచూసింది. రెండో ఇన్నింగ్స్​లో 36 పరుగులకే ఆలౌటై అప్రతిష్ఠ మూటగట్టుకుంది.

జనవరి 19, 2020.. ఆసీస్ ఓటమెరుగని గబ్బా పిచ్​పై అదే జట్టును మట్టికరిపించింది టీమ్ఇండియా. 32 ఏళ్ల కంగారూ జట్టు విజయపరంపరకు బ్రేక్ వేసింది. కోహ్లీ లేకుండా భారత జట్టు జీరో అంటూ మాట్లాడిన నోళ్లకు తాళం వేసింది.

ఆహా ఏమి టెస్టు క్రికెట్!

ఒక నెల.. ఎన్నో అవమానాలు, అనుమానాలు, బాధలు, మధురానుభూతులు, రికార్డులు ఇలా కలగలిపి భారత్-ఆస్ట్రేలియా టెస్టు సిరీస్ క్రికెట్ అభిమానులకు పసందైన ఫుల్ మీల్స్ వడ్డించింది. నైరశ్యం నుంచి నమదే ట్రోఫీ వరకు టీమ్ఇండియా ఫ్యాన్స్​ను ఉర్రూతలూగించింది. మొదటి టెస్టులో ఘోర ఓటమి తర్వాత బలంగా పుంజుకుని ఆస్ట్రేలియాను వారి గడ్డపైనే ఓడించి రికార్డు సిరీస్ కైవసం చేసుకుంది భారత జట్టు.

కోహ్లీ లేకుంటే జీరో!

ఆస్ట్రేలియా పర్యటన కోసం వారి గడ్డపై అడుగుపెట్టకముందు నుంచే టీమ్ఇండియాపై పలు వ్యాఖ్యలు చేశారు మాజీలు. కోహ్లీ లేకుండా భారత జట్టు టెస్టు సిరీస్ గెలవడం అసాధ్యమంటూ అభిప్రాయపడ్డారు. కానీ కోహ్లీ కాదు కీలక ఆటగాళ్లు లేకున్నా ఆసీస్​ను ఓడించి సిరీస్ కైవసం చేసుకుని అందరికీ ధీటైన సమాదానమిచ్చింది భారత జట్టు. సీనియర్లు లేకపోయినా మాలో పోటీతత్వం నిండుగా ఉందంటూ హెచ్చరిక జారీ చేసింది యువ భారత్.

kohli
కోహ్లీ

స్మిత్, వార్నర్ వచ్చారు!

టెస్టు సిరీస్​లో టీమ్ఇండియాను తక్కువ అంచనా వేయడానికి మరో కారణం ఆస్ట్రేలియా జట్టులోకి స్మిత్, వార్నర్ రావడం. 2018లో టీమ్ఇండియా అక్కడ టెస్టు సిరీస్ గెలిచినపుడు బాల్ టాంపరింగ్ వివాదం కారణంగా స్మిత్, వార్నర్ నిషేధం ఎదుర్కొంటున్నారు. దీంతో వారిరువురు లేనందున భారత జట్టు టెస్టు సిరీస్ గెలిచిందంటూ పలువురు వ్యాఖ్యానించారు. ఈ సిరీస్​లో స్మిత్, వార్నర్ ఉండటం వల్ల భారత్​కు ఓటమి తప్పదని అభిప్రాయపడ్డారు. కానీ అందరి అంచనాల్ని తలకిందులు చేస్తూ తొలి టెస్టులో ఓటమికి బదులు తీర్చుకుంది టీమ్ఇండియా. సిరీస్​నూ కైవసం చేసుకుంది.

IND vs AUS
వార్నర్, స్మిత్

గాయాల బెడద

పితృత్వ సెలవుల కారణంగా మొదటి టెస్టు తర్వాత స్వదేశానికి పయనమయ్యాడు సారథి కోహ్లీ. అసలు టెస్టు సిరీస్ ఆడకముందే గాయం కారణంగా పేసర్ ఇషాంత్ శర్మ దూరమవగా.. షమీ మొదటి టెస్టులో గాయపడి ఇంటిదారిపట్టాడు. అనంతరం రెండో టెస్టులో గాయపడిన ఉమేశ్ యాదవ్ చివరి రెండు టెస్టులకు అందుబాటులో లేడు. అయినా బుమ్రా ఉన్నాడులే అన్న ధీమా కూడా చివరి టెస్టుకు ఆవిరైంది. మూడో టెస్టులో గాయపడిన బుమ్రా నాలుగో మ్యాచ్​కు డ్రెస్సింగ్​ రూమ్​కే పరిమితమయ్యాడు. ఇతడితో పాటు ఈ సిరీస్​లో అద్భుత ప్రదర్శన కనబర్చిన ఆల్​రౌండర్లు రవీంద్ర జడేజా, అశ్విన్ కూడా గాయం కారణంగా చివరి టెస్టులో ఆడలేదు. దీంతో పేస్ బౌలింగ్​ అంతా యువ ఆటగాళ్లపై పడింది. బ్యాటింగ్​లోనూ కోహ్లీతో పాటు రాహుల్, విహారి గాయాల కారణంగా స్వదేశానికి పయనమయ్యారు. ఇంతమంది ఆటగాళ్లకు గాయాలైనా చివరి టెస్టు గెలిచి సిరీస్​ను 2-1 తేడాతో దక్కించుకుని చరిత్ర సృష్టించింది టీమ్ఇండియా. ఎన్ని ఇబ్బందులొచ్చినా తమలో పోటీతత్వం ఏమాత్రం తగ్గదని నిరూపించింది.

IND vs AUS
జడేజా, అశ్విన్

మేమున్నాం

కోహ్లీ, ఇషాంత్ శర్మ, షమీ, ఉమేశ్ యాదవ్, బుమ్రా, జడేజా, అశ్విన్, రాహుల్, విహారి.. వీరంతా లేకున్నా ఆస్ట్రేలియాతో జరిగిన చివరి టెస్టులో ఘనవిజయం సాధించింది టీమ్ఇండియా. వీరి గైర్హాజరితో మహ్మద్ సిరాజ్, శార్దూల్ ఠాకూర్, సైనీ, నటరాజన్, వాషింగ్టన్ సుందర్​లకు అవకాశం లభించింది. అందివచ్చిన అవకాశాన్ని చేజేతులా ఒడిసిపట్టిన వీరు అద్భుత ప్రదర్శన చేశారు. సిరాజ్ చివరి టెస్టు రెండో ఇన్నింగ్స్​లో ఐదు వికెట్లతో సత్తాచాటగా, సుందర్, శార్దూల్ తొలి ఇన్నింగ్స్​లో 62, శార్దూల్ 67 పరుగులతో టీమ్ఇండియా పోటీలో నిలబడేందుకు కారణమయ్యారు.

IND vs AUS
సిరాజ్, శార్దూల్

ఇవీ చూడండి: టీమ్ఇండియా మరపురాని విజయం.. రికార్డులపై ఓ లుక్కేద్దాం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.