ETV Bharat / sports

రెండో టెస్టులో కరోనా.. మూడో మ్యాచ్​కు మాస్క్​ తప్పనిసరి - క్రికెట్ లేటేస్ట్ న్యూస్

టీమ్​ఇండియా ఆసీస్​ రెండో టెస్టు చూసేందుకు వచ్చిన ఓ వ్యక్తికి కరోనా సోకినట్లు తేలింది. ఈ మ్యాచ్​లో భారత్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

IND vs AUS: Fan who attended MCG Test, tests positive for COVID-19
భారత్-ఆసీస్ రెండో టెస్టులో కరోనా కలకలం
author img

By

Published : Jan 6, 2021, 9:45 AM IST

Updated : Jan 6, 2021, 10:32 AM IST

భారత్-ఆస్ట్రేలియా 'బాక్సింగ్ డే' టెస్టుకు హాజరైన ఓ అభిమానికి కరోనా పాజిటివ్​గా తేలింది. ఈ విషయాన్ని మెల్​బోర్న్ క్రికెట్ క్లబ్ బుధవారం వెల్లడించింది. మ్యాచ్​కు వచ్చేటప్పుడు అతడి వైరస్​ బారిన పడనప్పటికీ, ఆ తర్వాత పాజిటివ్​ తేలినట్లు తెలిపారు.

"ఈనెల 27న బాక్సింగ్​ డే టెస్టుకు వచ్చిన వారిలో జోన్​ 5, ద గ్రేట్​ సదరన్ స్టాండ్​లో మధ్యాహ్నం 12:30 నుంచి 3:30 మధ్య ఉన్న వారు కొవిడ్ పరీక్షలు చేయించుకుని, నెగిటివ్​ వచ్చే వరకు బయటకు రావొద్దు" అని మెల్​బోర్న్ క్రికెట్ క్లబ్ తెలిపింది.

ఈ కారణంగా గురువారం(జనవరి 7) నుంచి ప్రారంభమయ్యే సిడ్నీ టెస్టుకు వచ్చే ప్రేక్షకులు స్టాండ్స్​లో ఉన్నప్పుడూ మాస్క్​లు ధరించాలని న్యూసౌత్​ వేల్స్ ప్రభుత్వం ఆదేశించింది. ఆతిథ్య సిడ్నీలో కేసులు పెరుగుతున్న కారణంగా స్టేడియంలోకి 25 శాతం మంది ప్రేక్షకుల్ని మాత్రమే అనుమతిస్తూ ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు.

నాలుగు టెస్టుల సిరీస్​లో భాగంగా తలో మ్యాచ్​ గెలిచిన భారత్, ఆస్ట్రేలియా.. మూడో టెస్టులో గెలిచి, ఆధిక్యం సంపాదించాలని చూస్తున్నాయి. మరి ఏమవుతుందో చూడాలి.

ఇది చదవండి: బాక్సింగ్ డే టెస్టు: ఆ ఘనత సాధించిన తొలి జట్టు భారత్

Last Updated : Jan 6, 2021, 10:32 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.