ETV Bharat / sports

ఆ షాట్ ఆడినందుకు బాధ లేదు: రోహిత్ - విమర్శలపై రోహిత్

తనపై వస్తున్న విమర్శల్ని రోహిత్ శర్మ తిప్పికొట్టాడు. నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్​ కావాలనే ఆ షాట్​ ఆడినట్లు చెప్పాడు. అలానే సహచర ఆటగాడు నటరాజన్​ ప్రదర్శనను మెచ్చుకున్నాడు.

Ind vs Aus: Don't regret playing that shot off Lyon, says Rohit
'నట్టు భారత ఆశాజ్యోతి.. ఆ షాట్​ కావాలనే ఆడాను'
author img

By

Published : Jan 16, 2021, 5:20 PM IST

Updated : Jan 16, 2021, 7:02 PM IST

ఆస్ట్రేలియాతో నాలుగో టెస్టు ఆడుతున్న భారత్ ఓపెనర్ రోహిత్ శర్మ.. ఇదే మ్యాచ్​తో అరంగేట్రం చేసిన నటరాజన్​ను ప్రశంసించాడు. అతడు తన బౌలింగ్​ను బాగా అర్థం చేసుకున్నాడని, భారత లైనప్​కు కావాల్సింది అదేనని అన్నాడు.

"నటరాజన్ మాకో ఆశాజ్యోతి. పరిమిత ఓవర్ల సిరీసుల్లో ఆడినప్పుడు అతడు ఎంతో క్రమశిక్షణ, నిబద్ధతను చూపించాడు. ఐపీఎల్​లో చూపిన ఆత్మవిశ్వాసాన్నే ఆసీస్​ గడ్డపైనా చూపిస్తున్నాడు. తన బౌలింగ్ శైలిని పూర్తిగా అర్థం చేసుకున్నాడు. భారత జట్టుకు కావాల్సింది అదే. ఆస్ట్రేలియాతో వారి దేశంలో ఆడటం అంత సులువు కాదు. తొలి మ్యాచ్​లోనే కీలక సమయాల్లో నట్టు, సుందర్.. తమ సామర్థ్యం చూపించారు. జట్టు ఏం కోరుకుంటుందో అదే ఇచ్చారు"

- రోహిత్​ శర్మ, టీమ్​ఇండియా వైస్ కెప్టెన్

గబ్బాలో జరుగుతున్న ఆఖరి టెస్టు తొలి ఇన్నింగ్స్​లో ఆస్ట్రేలియా 369 పరుగులు చేసింది. శార్దూల్, సుందర్, నటరాజన్​.. తలో మూడు వికెట్లు తీసి సత్తాచాటరు. అనంతరం బ్యాటింగ్ చేసిన టీమ్​ఇండియా.. రెండో రోజు ఆట పూర్తయ్యేసరికి 62/2తో నిలిచింది. 44 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద లైయన్​ బౌలింగ్​లో రోహిత్​ ఔటయ్యాడు. అయితే అతడి షాట్​ ఎంపికపై పలువురు మాజీలు ఇప్పటికే విమర్శలు చేస్తున్నారు. ఈ విషయమై ఇప్పుడు స్పందించాడు హిట్​ మ్యాన్.

"నేను ఎలా ఆడాలనుకున్నానో అలానే ఆడాను. ఏం బాధపడటం లేదు. భారీ షాట్​ ఆడి బౌలర్​పై ఒత్తిడి పెంచాలనుకున్నాను. అది ముఖ్యం కూడా. పరుగులు రావడం కష్టమైనప్పుడు ఎవరో ఒకరు దూకుడుగా ఆడాలి. నేను అదే చేశాను. ఆ క్రమంలో తప్పులు జరుగుతుంటాయి. దురదృష్టవశాత్తు ఔట్​ అయ్యాను" అని రోహిత్ చెప్పాడు.

ఇదీ చూడండి: రోహిత్ శర్మ ఆ షాట్ ఏంటి?.. గావస్కర్ విమర్శలు

Last Updated : Jan 16, 2021, 7:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.