ETV Bharat / sports

స్మిత్ సెంచరీ.. తొలి ఇన్నింగ్స్​లో ఆసీస్ 338 ఆలౌట్

టీమ్ఇండియాతో జరుగుతోన్న మూడో టెస్టు మొదటి ఇన్నింగ్స్​లో 320 పరుగులకు ఆలౌటైంది ఆస్ట్రేలియా. స్మిత్​ (131) అద్భుత సెంచరీతో ఆకట్టుకున్నాడు.

author img

By

Published : Jan 8, 2021, 9:22 AM IST

IND vs AUS
భారత్-ఆస్ట్రేలియా

టీమ్ఇండియాతో జరుగుతోన్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్​లో ఆస్ట్రేలియా గౌరవప్రదమైన స్కోర్ సాధించింది. స్మిత్ (131) సెంచరీకి తోడు లబుషేన్ (91), పకోస్కీ (62) రాణించడం వల్ల ఆసీస్ తొలి ఇన్నింగ్స్​లో 338 పరుగులకు ఆలౌటైంది.

ఓవర్​నైట్ స్కోర్ 166/2తో రెండో రోజు ఆట ప్రారంభించిన ఆసీస్​కు ఆదిలోనే దెబ్బతగిలింది. సెంచరీ దిశగా పయనిస్తున్న లబుషేన్​ (91)ను పెవిలియన్ చేర్చాడు జడేజా. తర్వాత వేడ్​(13)నూ ఔట్ చేసి భారత శిబిరంలో ఆనందాన్ని నింపాడు. కాసేపటికే గ్రీన్​ (0)ను వికెట్ల ముందు దొరికించుకున్నాడు బుమ్రా. ఓవైపు స్మిత్​ పోరాడుతున్నా మరో ఎండ్​లో వరుస వికెట్లను కోల్పోయింది కంగారూ జట్టు. దీంతో తొలి ఇన్నింగ్స్​లో 338 పరుగులు చేసి ఆలౌటైంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.