తొలి టీ20లో విజయం ఇచ్చిన ఉత్సాహంతో ఉన్న టీమ్ఇండియా.. రెండో మ్యాచ్‌లోనూ గెలిచి సిరీస్ సొంతం చేసుకోవాలని భావిస్తోంది. గత 19 నెలల కాలంలో ఆడిన తొమ్మిది టీ20ల్లో గెలవడం కోహ్లీసేనకు కలిసొచ్చే అంశం. మరి ఏం చేస్తారో చూడాలి.
శుక్రవారం జరిగిన తొలి టీ20లో కేఎల్ రాహుల్, జడేజా అద్భుత బ్యాటింగ్, కంకషన్ సబ్‌స్టిట్యూట్ చాహల్ స్పిన్ మాయాజాలం, నటరాజన్ యార్కర్లు.. ఈ విజయానికి కారణమయ్యాయి. పొట్టి ఫార్మాట్లో బలంగా ఉన్న కోహ్లీసేన.. వన్డే సిరీస్ ఓటమికి, టీ20 సిరీస్ గెలుపుతో సమాధానం చెప్పాలని చూస్తోంది.
హెల్మెట్‌కు బంతి తాకి కంకషన్‌కు గురైన జడేజా.. సిరీస్‌లోని మిగతా మ్యాచ్‌లకు దూరమయ్యాడు. అతడి స్థానంలో శార్దుల్ ఠాకుర్‌ను తీసుకున్నారు. అయితే జట్టులోని ఇతర ఆటగాళ్లు ఫామ్‌లోకి రావాల్సి ఉంది.
మరోవైపు తొలి టీ20లో ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని ఆసీస్ చూస్తోంది. భారత బ్యాటింగ్‌ను తమ బౌలింగ్‌తో పడగొట్టాలని భావిస్తోంది. కెప్టెన్ ఫించ్‌కు గాయమైందనే సూచనలు వస్తున్న నేపథ్యంలో, మ్యాచ్‌లో అతడు ఆడతాడో లేదో చూడాలి?
జట్లు(అంచనా)
టీమ్ఇండియా: ధావన్, కేఎల్ రాహుల్, కోహ్లీ(కెప్టెన్), సంజూ శాంసన్, మనీశ్ పాండే, హార్దిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, దీపక్ చాహర్, షమీ, నటరాజన్, చాహల్
ఆస్ట్రేలియా: షార్ట్, ఫించ్(కెప్టెన్), వేడ్, స్మిత్, మ్యాక్స్‌వెల్, హెన్రిక్స్, అబాట్, స్టార్క్, స్వీప్సన్, హేజిల్‌వుడ్, జంపా