ETV Bharat / sports

రైనా స్థానాన్ని భర్తీ చేయడం కష్టం: వాట్సన్​ - సీఎస్కే న్యూస్​

ఐపీఎల్​ నుంచి సురేశ్​ రైనా తప్పుకోవడం జట్టుకు తీరని లోటని అన్నాడు చెన్నై సూపర్​కింగ్స్​ ఓపెనర్​ షేన్ వాట్సన్​. రైనా, హర్భజన్​ స్థానాల్లో కొత్త వారికి అవకాశం ఇవ్వాలని అభిప్రాయపడ్డాడు.

Incredibly hard to replace Suresh Raina but CSK have depth: Shane Watson
సురేశ్​ రైనా స్థానాన్ని భర్తీ చేయడం కష్టం: వాట్సన్​
author img

By

Published : Sep 10, 2020, 2:04 PM IST

Updated : Sep 10, 2020, 2:38 PM IST

చెన్నై సూపర్​కింగ్స్​లో సురేశ్​ రైనా లాంటి సత్తా ఉన్న ఆటగాడికి ప్రత్యామ్నాయ ఎంపిక కష్టమని ఆ జట్టు ఓపెనర్​ షేన్​ వాట్సన్ అన్నాడు​. టోర్నీ నుంచి రైనా, హర్భజన్​ వైదొలగడం జట్టుకు తీరని లోటు అని, వారిద్దరి స్థానాల్లో మురళీ విజయ్, స్పిన్నర్​ పియూష్​ చావ్లాల​​కు అవకాశం ఇస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డాడు.

"చెన్నై సూపర్​కింగ్స్​లో ​రైనాకు ప్రత్యామ్నాయం వెతకడం కష్టమే. ఐపీఎల్​లో అత్యధిక పరుగులు చేసిన వారిలో అతడు రెండోవాడు. టోర్నీ​లో ఎక్కువ మ్యాచ్​లు ఆడిన ఆటగాడిగానూ గుర్తింపు తెచ్చుకున్నాడు. అలాంటి క్రికెటర్​, టోర్నీ నుంచి తప్పుకోవడం మా జట్టుకు తీరని లోటు. అతడి స్థానంలో మురళీ విజయ్​, హర్భజన్​ స్థానంలో చావ్లాకు అవకాశం ఇస్తారని భావిస్తున్నాను. వారిద్దరి అనుభవాన్ని జట్టు కోల్పోయినా.. పరిస్థితులను బట్టి కొత్త వారిని ఉపయోగించుకోవాలి".

- షేన్​ వాట్సన్​, చెన్నై సూపర్​కింగ్స్​ ఓపెనర్​

ఆగస్టు చివరి వారంలో ఐపీఎల్ కోసం యూఏఈ వెళ్లింది చెన్నై జట్టు. ఆ తర్వాత కొన్నిరోజులకు సీఎస్కే శిబిరంలోని కరోనా కలకలం సృష్టించింది. ఆటగాళ్లు రుతురాజ్​ గైక్వాడ్​, దీపక్​ చాహర్​ సహా 11 మంది సిబ్బంది వైరస్ బారిన పడ్డారు. దీంతో మిగతా ఆటగాళ్లతో పాటు సిబ్బందికి ​పరీక్షలు చేయగా నెగిటివ్​గా తేలింది. వైరస్​ సోకిన వారు కాకుండా మిగిలిన వారందరూ గత శుక్రవారం ప్రాక్టీస్ ప్రారంభించారు.

బుధవారం చేసిన కొవిడ్​ పరీక్షల్లో దీపక్​ చాహర్​కు కరోనా నెగెటివ్​గా తేలింది. మరోసారి చేసే టెస్ట్​ల్లో వైరస్​ లేదని నిర్ధరణ అయితే జట్టుతో కలిసి ప్రాక్టీసులో చేరొచ్చని జట్టు సీఈఓ వెల్లడించారు.

Last Updated : Sep 10, 2020, 2:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.