ETV Bharat / sports

కోహ్లీ, రోహిత్ జోడీ అదుర్స్: సంగక్కర - రోహిత్ కోహ్లీ గురించి సంగక్కర

టీమ్​ఇండియా క్రికెటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలపై ప్రశంసల జల్లు కురిపించాడు శ్రీలంక మాజీ క్రికెటర్ సంగక్కర. వారిద్దరూ ఒకప్పటి గంగూలీ, ద్రవిడ్​లను తలపిస్తున్నారని తెలిపాడు.

కోహ్లీ
కోహ్లీ
author img

By

Published : Jun 1, 2020, 8:14 PM IST

ప్రస్తుత తరంలో టీమ్​ఇండియా ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలను ఉత్తమ జోడీగా అభివర్ణించాడు శ్రీలంక మాజీ క్రికెటర్ సంగక్కర. వీరిద్దరూ అప్పట్లో గంగూలీ-ద్రవిడ్​లను తలపిస్తున్నారని తెలిపాడు. కష్టంతో కూడిన షాట్లను అలవోకగా ఆడుతూ గొప్ప ప్లేయర్లుగా ఎదిగారని కితాబిచ్చాడు.

"మీరు ఒకసారి గంగూలీ, ద్రవిడ్​ల బ్యాటింగ్ శైలిని గుర్తు తెచ్చుకుంటే వారిద్దరూ సంప్రదాయ షాట్లను ఆడేవారు. అందువల్ల వారి బ్యాటింగ్ శైలి చాలా సులువుగా అనిపించేది. ద్రవిడ్ కాస్త చూడముచ్చటైన షాట్స్ ఆడేవాడు. ప్రస్తుత తరంలో కోహ్లీ, రోహిత్ అలాంటి సంప్రదాయ షాట్లతో పాటు దూకుడైన ఆటతో రాణిస్తున్నారు. బంతిని బాదాలంటే కేవలం బలం ఉండాల్సిన పనిలేదని.. మంచి టైమింగ్​తో ఆడితే సరిపోతుందని వీరిద్దరూ నిరూపిస్తున్నారు."

-సంగక్కర, శ్రీలంక మాజీ క్రికెటర్

ప్రస్తుతం వన్డేల్లో నిబంధనలు మారాయని అది కాస్త బ్యాట్స్​మెన్​లకు అనుకూలంగా మారిన మాట వాస్తవమేనని తెలిపాడు సంగక్కర. కానీ మీరు గమనిస్తే కోహ్లీ, రోహిత్ మూడు ఫార్మాట్లలోనూ అద్భుతంగా రాణిస్తున్నారని గుర్తు చేశాడు. ఆ నిజాన్ని గమనించాలని సూచించాడు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.