ETV Bharat / sports

'రోహిత్​, బుమ్రా లేకపోయినా సిరీస్​ గెలిచాం' - రోహిత్​ శర్మ, బుమ్రా వార్తలు

రోహిత్​ శర్మ, బుమ్రా లాంటి స్టార్​ ఆటగాళ్లు లేకపోయినా ప్రస్తుత జట్టు బాగా రాణించి సిరీస్​ను కైవసం చేసుకుందని కెప్టెన్​ విరాట్​ కోహ్లీ అభిప్రాయపడ్డాడు. మరోవైపు హార్దిక్​ పాండ్య ఆటతీరుపై కోహ్లీ ప్రశంసలు కురిపించాడు. సిడ్నీ వేదికగా జరిగిన రెండో టీ20లో ఆస్ట్రేలియాపై భారత్ విజయం సాధించి మరో మ్యాచ్‌ మిగిలుండగానే సిరీస్ కైవసం చేసుకుంది.

I'm proud that we won T20 series without established players like Rohit, Bumrah: Kohli
'రోహిత్​ శర్మ, బుమ్రా లేకపోయినా సిరీస్​ గెలిచాం'
author img

By

Published : Dec 6, 2020, 8:30 PM IST

ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టీ20లో టీమ్​ఇండియా ఆటతీరు పట్ల సంతృప్తిని వ్యక్తం చేశాడు కెప్టెన్ విరాట్​ కోహ్లీ. రోహిత్ శర్మ, జస్​ప్రీత్​ బుమ్రా వంటి స్టార్​ ఆటగాళ్లు అందుబాటులో లేకున్నా మిగిలిన ఆటగాళ్లు రాణించడంపై హర్షం వ్యక్తం చేశాడు. హార్దిక్​ పాండ్య ఆటతీరుపై ప్రశంసలు కురిపించాడు.

"టీ20 సిరీస్​లో మేం చాలా బాగా ఆడాం. పరిమిత ఓవర్ల స్పెషలిస్టులైన రోహిత్ శర్మ, బుమ్రా వంటి స్టార్లు ప్రస్తుతం అందుబాటులో లేకపోయినా మా జట్టు బాగా రాణించింది. ఈ టీమ్​ పట్ల నేనెంతో గర్వంగా ఉన్నాను. 2016లో హార్దిక్​ జట్టులో ఎంపికవ్వడానికి ప్రధాన కారణం అతడి సామర్థ్యమే. అతడిలో అసలైన ప్రతిభ ఉంది. రాబోయే 4-5 ఏళ్లలో మరింత అత్యుత్తమంగా ఆడతాడు".

- విరాట్​ కోహ్లీ, టీమ్​ఇండియా కెప్టెన్​

వన్డే సిరీస్​లో ఓడిన తర్వాత టీ20 సిరీస్​లో అత్యుత్తమంగా రాణించాలని తామంతా భావించినట్లు కోహ్లీ తెలిపాడు. ఐపీఎల్​ వల్ల టీమ్​ఇండియా బలమైన టీ20 జట్టుగా మారిందని అభిప్రాయపడ్డాడు.

చివర్లో చేతులెత్తేశాం: వేడ్​

ఆరోన్​ ఫించ్​ గాయపడడం వల్ల అతడి స్థానంలో ఆస్ట్రేలియా జట్టుకు వికెట్​ కీపర్​ మాథ్యూ వేడ్​ జట్టుకు నాయకత్వం వహించాడు. రెండో టీ20లో తొలుత బ్యాటింగ్​ చేసి భారీ స్కోరు సాధించినప్పటికీ ఆసీస్​ ఓడిపోయింది.

"కెప్టెన్​గా వ్యవహరించడం చాలా సరదాగా ఉంది. హార్దిక్​ బ్యాటింగ్​కు వచ్చేంత వరకు అంతా బాగానే ఉంది. కానీ, బంతితో చివరి వరకు కట్టడి చేయలేకపోయాం. మరోవైపు నేను ఔటైన సమయంలో కాస్త నిరాశ చెందాను" అని వేడ్​ అన్నాడు.

సిరీస్​ కైవసం

సిడ్నీ వేదికగా ఉత్కంఠ భరితంగా సాగిన రెండో టీ20లో ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించిన టీమ్​ఇండియా.. మరో మ్యాచ్‌ మిగిలుండగానే సిరీస్‌ కైవసం చేసుకుంది. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆసీస్‌ నిర్ణీత 20 ఓవర్లలో అయిదు వికెట్లకు 194 పరుగులు చేసింది. మాథ్యూ వేడ్‌ (58) టాప్‌ స్కోరర్‌. అనంతరం బరిలోకి దిగిన భారత్‌ నాలుగు వికెట్లు కోల్పోయి 19.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేరుకుంది. శిఖర్‌ ధవన్‌ (52), హార్దిక్ పాండ్య (42), విరాట్ కోహ్లీ (40), కేఎల్‌ రాహుల్‌ (30) రాణించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.