ETV Bharat / sports

ఐపీఎల్​లోనూ ఓపెనర్​గా అదరగొడతా: కెప్టెన్ కోహ్లీ - kohli IPL opener

ఇంగ్లాండ్​తో చివరి టీ20లో ఓపెనర్​గా మెప్పించిన కోహ్లీ.. ఐపీఎల్​లోనూ ఇదే స్థానంలో రానున్నాడు. ఈ విషయాన్ని అతడే స్వయంగా వెల్లడించాడు.

I'm going to open in the IPL: Virat Kohli
ఐపీఎల్​లోనూ ఓపెనర్​గా అదరగొడతా: కెప్టెన్ కోహ్లీ
author img

By

Published : Mar 21, 2021, 6:45 AM IST

రాబోయే ఐపీఎల్​లో ఆర్సీబీ ఓపెనర్​గా వస్తానని కెప్టెన్ కోహ్లీ చెప్పాడు. ఇంగ్లాండ్​తో శనివారం జరిగిన నిర్ణయాత్మక మ్యాచ్​లో ఇదే స్థానంలో వచ్చిన విరాట్.. అద్భుత ఇన్నింగ్స్​తో జట్టును గెలిపించాడు. దీంతో సిరీస్​ 3-2 తేడాతో భారత్​ సొంతమైంది.

"అవును ఐపీఎల్​లోనూ నేను ఓపెనింగ్ చేస్తా. గతంలో చాలా స్థానాల్లో బ్యాటింగ్ చేశాను. ప్రస్తుతం భారత జట్టు మిడిలార్డర్ బలంగా ఉంది. అందుకే ఇద్దరు ఉత్తమ క్రికెటర్లు ఓపెనర్లుగా వస్తే అదరగొట్టొచ్చు" అని మ్యాచ్​ అనంతరం జరిగిన సమావేశంలో కోహ్లీ వెల్లడించాడు.

kohli latest news
టీమ్​ఇండియా కెప్టెన్ కోహ్లీ

"రోహిత్ లాంటి భాగస్వామితో బ్యాటింగ్​ను నేను చాలా ఇష్టపడతాను. మా ఇద్దరిలో ఒక్కరు కుదురుకున్నా.. ప్రత్యర్థిపై అధిక్యం చూపించొచ్చు. ఇప్పుడున్న ఫామ్​ను ఇలానే కొనసాగిస్తానని అనుకుంటున్నాను" అని విరాట్ స్పష్టం చేశాడు.

ఐదో టీ20లో టాస్ ఓడి బ్యాటింగ్​కు దిగిన టీమ్​ఇండియాకు.. ఓపెనర్లు కోహ్లీ-రోహిత్ శుభారంభం ఇచ్చారు. తొలి వికెట్​కు 94 పరుగులు జోడించారు. ఈ క్రమంలో ఇద్దరు అర్ధ శతకాలతో ఆకట్టుకున్నారు. తర్వాత క్రీజులోకి వచ్చిన సూర్య కుమార్, హార్దిక్ కూడా చెలరేగడం వల్ల జట్టు 224 పరుగుల భారీ స్కోరు చేయగలిగింది. ఛేదనలో తడబడిన ఇంగ్లాండ్.. 188/8 పరుగులే చేయగలిగింది.

team india news
టీమ్​ఇండియా జట్టు

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.