ETV Bharat / sports

'టీ20 ప్రపంచకప్​ జట్టులో ధోనీ ఉంటే మంచిది' - ధోనీ కుల్దీప్ టీ20 ప్రపంచకప్

టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీ, భారత జట్టుకు మళ్లీ ఆడితే బాగుంటుందని అభిప్రాయపడ్డాడు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్. తమకు పని సులభమవుతుందని చెప్పాడు.

'టీ20 ప్రపంచకప్​ జట్టులో ధోనీ ఉంటే మంచిది'
కుల్దీప్ యాదవ్ ధోనీ
author img

By

Published : May 9, 2020, 5:46 AM IST

Updated : May 9, 2020, 9:28 AM IST

ఈ ఏడాది జరగబోయే టీ20 ప్రపంచకప్​లో ధోనీ ఆడితే, తమకు పని సులభమవుతుందని చెప్పాడు టీమిండియా బౌలర్ కుల్దీప్ యాదవ్. అతడిని చాలా మిస్సవుతున్నానని, రీఎంట్రీ ఇస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డాడు. ఓ క్రీడా వెబ్​సైట్​తో ఇటీవలే జరిగిన లైవ్​ ఇంటర్వ్యూలో భాగంగా ఈ విషయాల్ని వెల్లడించాడు.

"ధోనీని చాలా మిస్సవుతున్నా. రిటైర్మెంట్ విషయం గురించి ఇక్కడ చర్చ అనవసరం. ఎప్పుడు ఏం చేయాలో అతడికి తెలుసు. వ్యక్తిగతంగా, అతడు మళ్లీ టీమిండియా తరఫున ఆడితే బాగుంటుందని అభిప్రాయం. అతడు జట్టులోకి వస్తే మాకు పని సులభమవుతుంది" -కుల్దీప్ యాదవ్, భారత స్పిన్నర్

గతేడాది జరిగిన వన్డే ప్రపంచకప్​లో చివరగా ఆడిన ధోనీ.. ఆ తర్వాత ఆటకు తాత్కాలిక విరామం ప్రకటించాడు. ఈ విషయమై ఇప్పటికే మాట్లాడిన సునీల్ గావస్కర్, కపిల్​దేవ్ వంటి మాజీలు.. మహీ రీఎంట్రీ ఇవ్వడం కష్టమని అన్నారు.

ఈ ఏడాది ఐపీఎల్​లో రాణించి, టీ20 ప్రపంచకప్​కు వెళ్లే టీమిండియాలో చోటు దక్కించుకోవాలన్న ధోనీకి నిరాశే ఎదురైంది. కరోనా కారణంగా టోర్నీ నిరవధిక వాయిదా పడింది. దీంతో పాటే వరల్డ్​కప్ జరిగేది? లేనిది సందేహంగా మారింది.

Last Updated : May 9, 2020, 9:28 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.