ETV Bharat / sports

'టెస్టు ఛాంపియన్​షిప్​ కోసం ఎదురుచూస్తున్నాం'

ఐసీసీ టెస్టు ఛాంపియన్​షిప్​ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నామని టీమిండియా సారథి విరాట్ కోహ్లీ తెలిపాడు. ఈ టోర్నీతో టెస్టు ఫార్మాట్​కు ఆదరణ పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశాడు.

'టెస్టు ఛాంపియన్​షిప్​ కోసం ఎదురుచూస్తున్నాం'
author img

By

Published : Jul 29, 2019, 2:18 PM IST

త్వరలో ప్రారంభం కానున్న ప్రపంచ ఛాంపియన్​షిప్​పై స్పందించాడు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ. అంతర్జాతీయ క్రికెట్​ మండలి(ఐసీసీ) తీసుకున్న ఈ నిర్ణయం వల్ల సంప్రదాయ టెస్టు ఫార్మాట్​కు ఆదరణ పెరుగుతుందని చెప్పాడు.

"మేం చాలా ఉత్సాహంతో టెస్టు ఛాంపియన్​షిప్​ కోసం ఎదురు చూస్తున్నాం. భవిష్యత్తులో దీనికి ఆదరణ పెరుగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. టెస్టుల్లో ఆడటం నిజంగా ఒక సవాలుగా ఉంటుంది. మా జట్టు కొన్నేళ్ల నుంచి ఈ ఫార్మాట్​లో అద్భుతంగా రాణిస్తోంది. అదే ఫామ్​ను ఈ ఛాంపియన్​షిప్​లోనూ కొనసాగిస్తాం." -విరాట్ కోహ్లీ, టీమిండియా కెప్టెన్

TEAM INDIA CAPTAIN VIRAT KOHLI
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ

యాషెస్​తో ప్రారంభం కానున్న టెస్టు ఛాంపియన్​షిప్ రెండేళ్ల పాటు జరగనుంది. భారత్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, పాకిస్థాన్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, వెస్టిండీస్ జట్లు మొత్తం 27 సిరీస్​ల్లో 71 మ్యాచ్​లు ఆడనున్నాయి.

ప్రతి జట్టు ఇంటా బయట తలో మూడు సిరీస్​లు ఆడుతుంది. ఒక్కో మ్యాచ్​ గెలిచిన జట్టుకు పాయింట్లు లభిస్తాయి. సిరీస్​లన్నీ పూర్తయ్యాక తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు 2021 జూన్లో ఇంగ్లాండ్​ వేదికగా ఫైనల్​లో తలపడతాయి

ఇది చదవండి: టెస్ట్​ క్రికెటర్లను గుర్తు పట్టడం మరింత సులువు

New Delhi, Jul 18 (ANI): Rain god continued to shower his blessings on national capital on Thursday. Rain lashed several parts of Delhi. Continuous rainfall has brought sigh of relief among delhites from scorching heat. According to IMD, there will be cloudy sky with moderate rain. The minimum temperature recorded was 25 degree Celsius while maximum was 32 degree Celsius.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.