ప్రస్తుతం ఇంగ్లండ్ వేదికగా పురుషుల ప్రపంచకప్ జరుగుతోంది. అదే విధంగా మహిళల ప్రపంచకప్ మ్యాచ్‌లు జరిగే తేదీలు ప్రకటించింది అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ). న్యూజిలాండ్ వేదికగా 2021 జనవరి 30 నుంచి ఫిబ్రవరి 20 వరకు ఈ టోర్నీ జరగనుంది. మొత్తం 31 మ్యాచ్‌లు జరగనున్నాయి.
న్యూజిలాండ్ ఆతిథ్యమిస్తున్న నాలుగో అంతర్జాతీయ టోర్నీ ఇది. ఇంతకు ముందు 1992, 2015లలో పురుషుల ప్రపంచకప్‌ను, 2000లో మహిళల క్రికెట్ ఈవెంట్‌ను నిర్వహించింది.
2017లో సొంతగడ్డపై జరిగిన మహిళల ప్రపంచకప్‌లో ఇంగ్లండ్ విజేతగా నిలిచింది.
ఐసీసీ మహిళా ఛాంపియన్షిప్ పాయింట్ల పట్టిక ఆధారంగా తొలి నాలుగు స్థానాల్లోని జట్లు నేరుగా ప్రపంచకప్‌నకు అర్హత సాధిస్తాయి. ఈ జాబితాలో ఆస్ట్రేలియా(22), ఇంగ్లండ్(22), టీమిండియా(16), దక్షిణాఫ్రికా(16) టాప్-4లో ఉన్నాయి. ఆతిథ్యమిస్తున్నందున న్యూజిలాండ్‌కు నేరుగా ఆడే అవకాశం దక్కింది. మిగతా 3 జట్లు క్వాలిఫయర్ మ్యాచ్‌ల ద్వారా అర్హత సాధిస్తాయి.
ఇది చదవండి: అభిమానానికి వయసుతో పనేంటి! అని నిరూపించిన ఓ మహిళ