మహిళల వన్డే క్రికెట్ ర్యాంకింగ్స్‌ను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) మంగళవారం ప్రకటించింది. కరోనా సంక్షోభం తర్వాత భారత మహిళల జట్టు ఏ సిరీస్‌లో ఆడకపోయినా.. ర్యాంకుల్లో కొనసాగుతుండటం విశేషం. ఓపెనర్ స్మృతి మంధాన (732 పాయింట్లు) బ్యాట్స్ఉమన్ల జాబితాలో.. రెండు స్థానాలను కోల్పోయి ఆరుకు చేరుకుంది. బౌలర్ల జాబితాలో జులన్ గోస్వామి 5లోనే కొనసాగుతుంది.
బ్యాటింగ్‌లో..
కెప్టెన్ మిథాలీరాజ్.. 687 పాయింట్లతో బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో 9వ స్థానంలో ఉంది. న్యూజిలాండ్ మహిళల జట్టుతో జరిగిన మ్యాచ్‌లో సత్తా చాటిన ఇంగ్లాండ్ ఓపెనర్ టామీ బ్యూమాంట్.. ఐదు స్థానాలు మెరుగై.. అగ్రస్థానంలో నిలిచింది.
బౌలింగ్‌లో..
బౌలర్ల జాబితాలో.. భారత్ స్పిన్నర్ పూనమ్ యాదవ్ (679), శిఖా పాండే (675) వరుసగా ఆరు, ఏడు స్థానాల్లో నిలిచారు. ఆల్‌రౌండర్ దీప్తి శర్మ కూడా బౌలింగ్ జాబితాలో 10వ స్థానంలో కొనసాగుతోంది. మహిళల బౌలింగ్ ర్యాంకుల జాబితాలో 804 పాయింట్లతో ఆస్ట్రేలియాకు చెందిన జెస్ జోనాస్సెన్ అగ్రస్థానంలో ఉంది.
ఆల్‌రౌండర్ల జాబితాలో..
ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్‌లో టీమ్ఇండియాకు చెందిన దీప్తి శర్మ.. 359 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది. ఇందులో ఏకైక భారత క్రికెటర్ దీప్తి కావడం విశేషం. ఆస్ట్రేలియాకు చెందిన ఎల్లిసా పెర్రీ.. 460 పాయింట్లతో మొదటిస్థానంలో నిలిచింది.
ఇదీ చూడండి: 'ఎవర్ని ఎలా ఔట్ చేయాలో అశ్విన్‌కు బాగా తెలుసు'