ETV Bharat / sports

600 వికెట్ల మార్క్​తో టాప్​-10లో చేరిన అండర్సన్​

author img

By

Published : Aug 26, 2020, 6:20 PM IST

Updated : Aug 26, 2020, 6:56 PM IST

​పాకిస్థాన్​తో జరిగిన టెస్టు సిరీస్​లో 600 వికెట్ల మార్కును అందుకున్నాడు ఇంగ్లాండ్​ పేసర్​ జేమ్స్​ అండర్సన్​. దీంతో ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్​లో ఆరు స్థానాలు మెరుగై.. టాప్​-10లో చోటు దక్కించుకున్నాడు. 781 పాయింట్లతో బౌలర్ల​ ర్యాంకింగ్స్​లో 8వ స్థానానికి చేరాడు అండర్సన్​.

ICC Test Rankings: Zak Crawley, James Anderson Gain Big After Southampton Heroics
600 వికెట్ల మార్క్​తో టాప్​-10లో చేరిన అండర్సన్

టెస్టు ఫార్మాట్​కు సంబంధించిన ర్యాంకింగ్స్​ను అంతర్జాతీయ క్రికెట్​ మండలి (ఐసీసీ) బుధవారం విడుదల చేసింది. బౌలింగ్​ ర్యాంకింగ్స్​లో ఇంగ్లాండ్​ పేసర్​ జేమ్స్​ అండర్సన్ టాప్​-10లో​ చోటు దక్కించుకున్నాడు. పాకిస్థాన్​తో జరిగిన టెస్టు సిరీస్​లో 600 వికెట్ల మైలురాయిని చేరుకొని.. ఈ ఘనత సాధించిన తొలి ఫాస్ట్​ బౌలర్​గా ఘనత సాధించాడు.

ఈ ప్రదర్శనతో ర్యాంకింగ్స్​లో ఆరు స్థానాలను మెరుగుపరచుకుని 781 పాయింట్లతో 8వ స్థానానికి చేరాడు అండర్సన్​. టాప్​-10లో ఉన్న ఏకైక భారత ఆటగాడు జస్​ప్రీత్​ బుమ్రా.. 779 పాయింట్లతో అండర్సన్​ తర్వాతి స్థానంలో కొనసాగుతున్నాడు.

లైన్‌ అండ్‌ లెంగ్త్‌.. స్వింగ్‌.. ఈ రెండింటిని నమ్ముకొని క్రమశిక్షణతో బౌలింగ్‌ చేస్తూ వికెట్లు సాధిస్తాడు జేమ్స్‌ అండర్సన్‌. వసీం‌ అక్రమ్‌ తర్వాత ప్రపంచ క్రికెట్​లో స్వింగ్‌ అనగానే గుర్తొచ్చే ఫాస్ట్‌బౌలర్‌ అతనే. అక్రమ్‌ అంత వేగం, వైవిధ్యం లేకపోయినా.. అతనంత గొప్ప పేరూ తెచ్చుకోకపోయినా.. అక్రమ్‌ కూడా అందుకోలేని 600 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు జేమ్స్​.

టెస్టు ఫార్మాట్​లో 700 వికెట్ల మార్క్​ను అందుకునే మొదటి పేసర్​ కూడా తానే అవుతానని ధీమా వ్యక్తం చేశాడు ఇంగ్లాండ్​ బౌలర్​ జేమ్స్​ అండర్సన్​. మంగళవారం పాకిస్థాన్​తో జరిగిన చివరి టెస్టులో కెప్టెన్​ అజార్​ అలీని ఔట్​ చేసిన అండర్సన్​.. 600 వికెట్లు పడగొట్టిన మార్క్​ను చేరుకున్న తర్వాత ఈ వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం టెస్టుల్లో అత్యధిక వికెట్లు సాధించిన నాలుగో బౌలర్​గా ఉన్నాడు.

"నేను యాషెస్​ కోసం జట్టులో ఉండాలని కెప్టెన్​ జో రూట్​ కోరాడు. అయితే జట్టులో నేను ఉంటానో ఉండనో అర్థం కావడం లేదు. నా ఫిట్​నెస్​ కోసం ఎప్పటికప్పుడు కష్టపడుతున్నాను. ఆట కోసం తీవ్రంగా కృషి చేస్తున్నాను. టీమ్​లో కొనసాగడానికి నాకు ఇంకా అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నా. టెస్టుల్లో 700 వికెట్లు పడగొట్టిన మార్క్​ను చేరుకోగలను. నేను ఆడిన మొదటి టెస్టు (2003లో)ను తిరిగి చూసుకుంటే 600 వికెట్ల మార్క్​కు చేరుతానని ఎప్పుడూ అనుకోలేదు. చాలా కాలం పాటు జట్టులో కొనసాగడాన్ని నా అదృష్టంగా భావిస్తున్నా".

-జేమ్స్​ అండర్సన్​, ఇంగ్లాండ్​ పేసర్​

టెస్టుల్లో మురళీధరన్‌ (800), వార్న్‌ (708), కుంబ్లే (619) మాత్రమే అతడి కంటే ఎక్కువ వికెట్లు తీశారు. కానీ ఆ ముగ్గురూ స్పిన్నర్లు. వాళ్లకుండే సానుకూలతలు వేరు. వాళ్లలా ఫాస్ట్‌బౌలర్లు సుదీర్ఘ కాలం ఆటలో కొనసాగలేరు. మ్యాచ్‌లో ఎక్కువ ఓవర్లు వేయలేరు. వాళ్లు పడే కష్టం, ఎదుర్కొనే ఒత్తిడి అసాధారణమైంది. అయినా సరే.. స్పిన్నర్‌ అయిన మురళీధరన్‌ కంటే 600 వికెట్ల ఘనతకు కేవలం ఆరు బంతులు మాత్రమే ఎక్కువ తీసుకున్నాడు అండర్సన్‌.

2003లో జింబాబ్వేపై ఆడిన అరంగేట్ర టెస్టు తొలి ఇన్నింగ్స్‌లోనే అయిదు వికెట్ల ప్రదర్శనతో అండర్సన్‌ ప్రస్థానం మొదలైంది. అతను ఏకంగా 17 ఏళ్ల పాటు టెస్టు క్రికెట్లో కొనసాగుతాడని, 600 వికెట్ల మైలురాయిని అందుకుంటాడని ఎవరూ ఊహించి ఉండరు.

Last Updated : Aug 26, 2020, 6:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.