ETV Bharat / sports

టెస్ట్ ర్యాంకింగ్స్​: రూట్​ జోరు- కోహ్లీ బేజారు - icc test rankings kohli fifth place

ఐసీసీ తాజాగా ప్రకటించిన టెస్టు ర్యాంకింగ్స్​లో ఇంగ్లాండ్​ కెప్టెన్​ రూట్​ తన స్థానాన్ని మెరుగుపరుచుకుని మూడో స్థానానికి చేరుకున్నాడు. టీమ్​ఇండియా సారథి కోహ్లీ ఐదో స్థానానికి పడిపోయాడు.

kohli
కోహ్లీ
author img

By

Published : Feb 10, 2021, 2:35 PM IST

Updated : Feb 10, 2021, 3:29 PM IST

అంతర్జాతీయ క్రికెట్​ మండలి(ఐసీసీ) బుధవారం టెస్టు క్రికెట్​ ర్యాంకింగ్స్​ విడుదల చేసింది. బ్యాట్స్​మెన్ విభాగంలో విరాట్ కోహ్లీ మరో స్థానం కోల్పోయి 852 పాయింట్లతో ఐదో ర్యాంకుకు పడిపోయాడు. ఇటీవల శ్రీలంక, టీమ్​ఇండియాతో జరగిన టెస్టులలో​ రెండు డబుల్​ సెంచరీతో మెరిసిన ఇంగ్లాండ్​ సారథి జో రూట్​ రెండు స్థానాలు ఎగబాకి 883 పాయింట్లతో మూడో స్థానానికి చేరుకున్నాడు. న్యూజిలాండ్ సారథి కేన్ విలియమ్సన్(919) మొదటి స్థానాన్ని, ఆసీస్​ స్టార్​ స్మిత్​(891) పాయింట్లతో రెండో స్థానాన్ని కాపాడుకున్నారు. మార్నస్​ లబుషేన్(ఆసీస్​), పుజారా(టీమ్​ఇండియా) తమ స్థానాలను కోల్పోయి నాలుగు, ఏడు స్థానాలకు పరిమితమయ్యారు.

ఇంగ్లాండ్​తో జరిగిన తొలి టెస్టులో టీమ్​ఇండియా తొలి ఇన్నింగ్స్​లో రిషభ్​ పంత్(91) అద్భుత ఇన్నింగ్స్​ ఆడాడు. ఫలితంగా 700పాయింట్లతో 13వ స్థానంలో నిలిచాడు. దీంతో భారత్​ తరఫున 700 పాయింట్లు సాధించిన తొలి వికెట్​ కీపర్​గా గుర్తింపు పొందాడు. శుభమన్​ గిల్​ 40, ఆల్​రౌండర్​ వాషింగ్టన్​ సుందర్​ 81వ స్థానాల్లో నిలిచారు. ​

బౌలింగ్​ విభాగంలో ఓ స్థానం మెరుగుపరుచుకుని టీమ్​ఇండియా ఆటగాళ్లు రవిచంద్రన్​ అశ్విన్​(771), జస్ప్రిత్​ బుమ్రా(769) పాయింట్లతో ఏడు, ఎనిమిది స్థానాల్లో నిలిచారు. ఇంగ్లాండ్​ క్రికెటర్​ జేమ్స్​ అండర్సన్​(826) మూడు స్థానాలు ఎగబాకి మూడో స్థానానికి చేరుకున్నాడు. 908 పాయింట్లతో ప్యాట్​ కమిన్స్(ఆసీస్​)​ మొదటి స్థానాన్ని, 830 పాయింట్లతో స్టువర్ట్​ బ్రాడ్(ఇంగ్లాండ్​) రెండో స్థానాన్ని కాపాడుకున్నారు. ​

ఇదీ చూడండి: ఇంగ్లాండ్​పై టీమ్​ఇండియా ఓటమికి కారణాలివే!

Last Updated : Feb 10, 2021, 3:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.