ETV Bharat / sports

ఐసీసీ ర్యాంకింగ్స్: వన్డేల్లో కోహ్లీ టాప్- టీ20ల్లో ఫోర్త్ - ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్

టీ20తో పాటు వన్డే ర్యాంకింగ్స్​ను ఐసీసీ ప్రకటించింది. తాజా ర్యాంకింగ్స్​లో భారత సారథి విరాట్ కోహ్లీ పొట్టి ఫార్మాట్​లో నాలుగో స్థానంలో, వన్డేల్లో అగ్రస్థానంలో ఉన్నాడు. వైస్​ కెప్టెన్ రోహిత్ టీ20ల్లో 14వ స్థానంలో కొనసాగుతున్నాడు.

ICC T20I Rankings: Kohli moves to fourth spot
ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్: నాలుగో స్థానంలో కోహ్లీ​
author img

By

Published : Mar 24, 2021, 2:57 PM IST

Updated : Mar 24, 2021, 3:20 PM IST

ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్​ను అంతర్జాతీయ క్రికెట్ మండలి విడుదల చేసింది. తాజా జాబితాలో టీమ్​ఇండియా కెప్టెన్ విరాట్​ కోహ్లీ, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ తమ స్థానాలను మెరుగుపరుచుకున్నారు. కోహ్లీ నాలుగో స్థానంలో నిలవగా.. హిట్​మ్యాన్ 14వ స్థానంలో కొనసాగుతున్నాడు. ఈ విభాగంలో ఇంగ్లాండ్​ బ్యాట్స్​మెన్ డేవిడ్ మలన్ అగ్రస్థానంలో ఉన్నాడు.

టాప్​-5లో లోకేశ్​ రాహుల్​ ర్యాంకు దక్కించుకున్నాడు. యువ బ్యాట్స్​మెన్​ శ్రేయస్ అయ్యర్​ ఐదు స్థానాలు మెరుగుపరుచుకుని కెరీర్​లో అత్యుత్తమ ర్యాంకు పొందాడు. అతడు ప్రస్తుతం 26వ ర్యాంకులో ఉన్నాడు. సూర్యకుమార్ యాదవ్​తో పాటు రిషభ్​ పంత్​ కూడా వారి ర్యాంకులను మెరుగుపరుచుకున్నారు.

బౌలర్ల విభాగంలో ఇంగ్లిష్​ ఆటగాడు ఆదిల్ రషీద్​ నాలుగో స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. క్రిస్​ జోర్డాన్ 17వ ర్యాంకులో ఉన్నాడు. జోఫ్రా ఆర్చర్​ 12 స్థానాలు మెరుగుపరుచుకుని 22వ ర్యాంకులో ఉన్నాడు. మార్క్ వుడ్​ 12 ర్యాంకులు మెరుగుపరుచుకుని 27వ స్థానంలో కొనసాగుతున్నాడు. భారత ఆటగాడు​ వాషింగ్టన్ సుందర్ 14వ ర్యాంకుతో టాప్-20లో చోటు సంపాదించాడు. ​ఈ జాబితాలో అగ్రస్థానంలో సౌతాఫ్రికా క్రికెటర్ తబ్రైజ్​ షమి తొలిసారి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు.

వన్డే ర్యాంకింగ్స్​..

ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్​నూ అంతర్జాతీయ క్రికెట్ మండలి ప్రకటించింది. భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ 868 పాయింట్లతో అగ్రస్థానాన్ని మరింత పదిలం చేసుకున్నాడు. రోహిత్ శర్మ ఒక స్థానాన్ని కోల్పోయి 3వ స్థానాన్ని దక్కించుకున్నాడు. పాకిస్థాన్ క్రికెటర్​ బాబర్ అజామ్ 837 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.

బౌలింగ్ విభాగంలో టాప్​-10లో భారత్ తరఫున జస్ప్రీత్​ బుమ్రా మూడో స్థానంలో ఉన్నాడు. ఈ విభాగంలో న్యూజిలాండ్​ ఆటగాడు ట్రెంట్ బౌల్ట్​ 742 పాయింట్లతో తొలి స్థానాన్ని దక్కించుకున్నాడు. ఆల్​రౌండర్ల జాబితాలో రవీంద్ర జడేజా 9వ స్థానంలో ఉన్నాడు. ఇంగ్లాండ్ ఆటగాడు బెన్ స్టోక్స్​, క్రిస్​ వోక్స్​ వరుసగా 3, 4 ర్యాంకులలో కొనసాగుతున్నారు. ఈ విభాగంలో బంగ్లా ప్లేయర్ షకిబ్​ మొదటి స్థానంలో ఉన్నాడు.

ఇదీ చదవండి: పెళ్లికి సిద్ధమైన ఆర్సీబీ స్పిన్నర్

Last Updated : Mar 24, 2021, 3:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.