ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో భారత బ్యాట్స్‌మెన్ రోహిత్ శర్మ కెరీర్ అత్యుత్తమ ర్యాంక్ సాధించాడు. పింక్ టెస్టులో(66,25*) నిలకడైన ప్రదర్శన చేసిన రోహిత్.. బ్యాటింగ్ జాబితాలో ఆరు స్థానాలు మెరుగుపరుచుకుని 8వ స్థానంలో నిలిచాడు. ఈ లిస్టులో కివీస్ కెప్టెన్ విలియమ్సన్ తొలి స్థానాన్ని పదిలం చేసుకున్నాడు. ఇంగ్లాండ్ సారథి రూట్ 4, భారత కెప్టెన్ కోహ్లీ 5వ స్థానాలలో కొనసాగుతున్నారు.
బౌలింగ్ విభాగంలో రవిచంద్రన్ అశ్విన్ నాలుగు స్థానాలు మెరుగుపరుచుకుని 3వ స్థానాన్ని దక్కించుకున్నాడు. ఈ జాబితాలో మరో భారత బౌలర్ బుమ్రా ఒక స్థానాన్ని కోల్పోయి 9వ స్థానానికి పడిపోయాడు. ఈ లిస్టులో మొదటి స్థానంలో ఆసీస్ బౌలర్ కమిన్స్ ఉన్నాడు.
అక్షర్ 38వ స్థానం..
సుదీర్ఘ ఫార్మాట్లో ఇటీవల అరంగ్రేటం చేసిన అక్షర్ పటేల్ 38వ స్థానానికి చేరుకున్నాడు. ఇక ఆల్‌రౌండర్ల జాబితాలో జడేజా రెండో స్థానంలో ఉండగా.. అశ్విన్ ఐదో స్థానాన్ని పొందాడు. ఈ జాబితాలో విండీస్ ఆటగాడు జేసన్ హోల్డర్ మొదటి స్థానంలో కొనసాగుతున్నాడు.
ఇంగ్లాండ్ స్పిన్నర్ జాక్ లీచ్ తొలిసారి 30లోకి ప్రవేశించాడు. అతడు 28వ స్థానంలో ఉన్నాడు.
ఇదీ చదవండి: షూటింగ్ ప్రపంచకప్: భారత షాట్‌గన్ కోచ్‌కు కరోనా