ఐసీసీ మహిళల వన్డే ర్యాంకింగ్స్‌ను అంతర్జాతీయ క్రికెట్ మండలి విడుదల చేసింది. బ్యాట్స్ఉమెన్ జాబితాలో సౌతాఫ్రికా ఓపెనర్ లిజెల్లీ లీ ఏడు స్థానాలు మెరుగుపరుచుకుని అగ్ర స్థానానికి చేరింది. భారత్‌తో జరుగుతోన్న సిరీస్‌లో రాణిస్తున్న లీ.. కెరీర్లో రెండో సారి అత్యుత్తమ ర్యాంక్ దక్కించుకుంది. ఇంగ్లాండ్ క్రీడాకారిణి టామీ బ్యూమాంట్ రెండో స్థానానికి పడిపోయింది.
ఇండియా ఓపెనర్ పూనమ్ రౌత్ కూడా 8 స్థానాలు మెరుగుపరుచుకుని.. 18వ స్థానాన్ని దక్కించుకుంది. టాప్-10లో భారత్ తరఫున స్మృతి మంథాన 7, మిథాలీ రాజ్ 9 స్థానాలలో కొనసాగుతున్నారు.
-
Take a bow, @zella15j 💥
— ICC (@ICC) March 16, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
Her superb form in the ongoing series against India has helped Lizelle Lee shoot up to the top of the @MRFWorldwide ICC Women's ODI Rankings for batters! pic.twitter.com/yAU76yfl6x
">Take a bow, @zella15j 💥
— ICC (@ICC) March 16, 2021
Her superb form in the ongoing series against India has helped Lizelle Lee shoot up to the top of the @MRFWorldwide ICC Women's ODI Rankings for batters! pic.twitter.com/yAU76yfl6xTake a bow, @zella15j 💥
— ICC (@ICC) March 16, 2021
Her superb form in the ongoing series against India has helped Lizelle Lee shoot up to the top of the @MRFWorldwide ICC Women's ODI Rankings for batters! pic.twitter.com/yAU76yfl6x
బౌలింగ్ విభాగంలో ఆసీస్ బౌలర్ జెస్ జోనస్సెన్ 804 పాయింట్లతో టాప్‌లో ఉంది. భారత్ తరఫున జులాన్ గోస్వామి, పూనమ్ యాదవ్, శిఖా పాండే టాప్-10లో ఉన్నారు. మరో భారత స్పిన్నర్ రాజేశ్వరీ గైక్వాడ్ కెరీర్లో అత్యుత్తమ ర్యాంకు దక్కించుకుంది. ప్రస్తుతం 18వ ర్యాంకులో కొనసాగుతోంది. దక్షిణాఫ్రికా తరఫున శబ్నిమ్ ఇస్మాయిల్, మారిజాన్ కాప్ టాప్-5లో ఉన్నారు.
ఇదీ చదవండి: ప్రియసఖితో బుమ్రా డ్యాన్స్.. వీడియో వైరల్